Breaking News

జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదంపై కేంద్రానిదే బాధ్యత: ఒమర్‌ అబ్దుల్లా

Published on Wed, 07/17/2024 - 17:50

శ్రీనగర్‌: జమ్ము​ కశ్మీర్‌లో ఉగ్రవాదం అంతం కాబోతోందని కేంద్ర చెబుతోంది, కానీ అలా జరగుతున్నట్లు తమకు కనిపించటంలేదని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ) నేత ఒమర్‌ అబ్దుల్లా అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. 

‘జమ్ము కశ్మీర్‌లో ఇటీవల దోడా జిల్లాలో జరిగిన ఉగ్రవాద ఘటన మొదటి కాదు. నిజం ఏమింటే.. గత ఏడాది నుంచి ఇక్కడ  ఉగ్రవాద దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. జమ్ములోని పలు ప్రాంతాల్లో కూడా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ఇక్కడ చోటు చేసుకుంటున్న ఆందోళనకర పరిస్థితులకు కేంద్ర ప్రభుత్వం, పోలీసులు బాధ్యత వహించాలి. 

ఇప్పటివరకు 55 మంది సైనికులు మృతి చెందారు. ఇలాంటి పరిస్థితులో​ అసలు ప్రభుత్వం  ఏం చేస్తోందని డిమాండ్‌ చేస్తున్నాం. కేంద్రం మాత్రం తరచూ జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదం తగ్గుతోందని చెబుతోంది. కానీ, ఇక్కడి పరిస్థితిని చూస్తే ఉగ్రవాదం ‍ ఇంకా కొనసాగుతున్నట్లే  కనిపిస్తోంది. అదీకాక ఉగ్రవాదాన్ని అరికట్టడానికి ఏమాత్రం  చర్యలు తీసుకోవటం లేదు. కేంద్రం చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు.

ఇటీవల జమ్ము  కశ్మీర్‌ ఉగ్రవాదం పెరగడానికి ఇక్కడి ప్రాంతీయ పార్టీల రాజకీయాలే కారణమని డిజీపీ ఆర్‌ఆర్‌ స్వైన్‌ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. డీజీపీ చేసిన వాఖ్యలను మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. 

‘డీజేపీ రాజకీయ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. రాజకీయాలను రాజకీయ నాయకులకు వదిలిపెట్టాలి. ఆయన జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదం ఎలా కరికట్టాలో చర్యలు తీసుకోవటంలో దృష్టి పెట్టాలి. డీజీపీగా ఆయన పని.. ఆయన చేస్తే..  మా పని మేము చేస్తాం’అని ఒమర్‌ అబ్దుల్లా అన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)