మోదీని గద్దెదించడం సంఘ్‌ పరివార్‌ వల్ల కాదు, కానీ..: రేవంత్‌ రెడ్డి

Published on Sat, 08/02/2025 - 13:51

సాక్షి, న్యూఢిల్లీ: దేశ ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పీఠాన్ని వదులుకునేందుకు మోదీ సిద్ధంగా లేరని, ఆయన్ని గద్దె దించాలని సంఘ్‌ పరివార్‌ తీవ్రంగా ప్రయత్నిస్తోందని అన్నారాయన. శనివారం ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ న్యాయ సదస్సులో రేవంత్ మాట్లాడుతూ.. 

‘‘తెలంగాణలో కుల గణన పూర్తి చేశాం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. సామాజిక న్యాయంలో భాగంగా రిజర్వేషన్లు కల్పిస్తాం. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబం కాంగ్రెస్ పార్టీది. 2004, 2009 లో ప్రధాని అయ్యే అవకాశం ఉన్న రాహుల్ గాంధీ తీసుకోలేదు. సీనియర్లకు ప్రధాని పదవి అప్పగించారు. కానీ.. 

..2001 నుంచి నరేంద్ర మోదీ అధికార కుర్చీని వీడడం లేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆ కుర్చీని వదిలేయాలని చెప్పినా కూడా మోదీ వదలడం లేదు. 75 ఏళ్ల వయసు వచ్చిన వారు పదవి దిగిపోవాలని ఆర్ఎస్ఎస్ చీఫ్‌ మోహన్ భగవత్ అన్నారు. అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్లకు వర్తించిన వయస్సు పరిమితి అంశం.. మోదీకి వర్తించదా?.. 

.. మోదీని గద్దె నుంచి దించేందుకు సంఘ్‌ పరివార్‌ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ ఆయన అందుకు సిద్ధంగా లేరు. మోదీని దించేయడం సంఘ్‌ పరివార్‌ వల్ల కాదు. మోదీని గద్దె దింపడం కేవలం కాంగ్రెస్‌ పార్టీ, రాహుల్‌ గాంధీ వల్లే అవుతుంది. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ నేతృత్వంలో మోడీని గద్దె దింపుతాం. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 150 సీట్లకు మించి గెలవదు. మోదీ బారి నుంచి దేశాన్ని రక్షిస్తాం. దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు’’ అని రేవంత్‌ అన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)