Breaking News

చంద్రబాబు నైతిక విలువలు పాటించే వ్యక్తి కాదు: వైఎస్‌ జగన్‌

Published on Fri, 08/02/2024 - 14:07

గుంటూరు, సాక్షి: విశాఖ జిల్లా స్థానిక సంస్థల్లో వైఎస్సార్‌సీపీకి భారీ మెజార్టీ ఉందని.. అయినా టీడీపీ పోటీకి వెళ్తోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ  ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి విశాఖ నేతలతో తన క్యాంప్‌ కార్యాలయంలో భేటీ అయిన ఆయన.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

స్థానిక సంస్థల్లో వైఎస్సార్‌సీపీకి భారీ మెజార్టీ ఉంది. సహజంగా ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ పోటీ పెట్టకూడదు. కానీ చంద్రబాబు ఏరోజూ నైతిక విలువలు పాటించే వ్యక్తి కాదు. అందుకే బరిలో తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. పైగా.. అడ్డగోలుగా ప్రలోభాలు, బెదిరింపులతో  గెలవడానికి ప్రయత్నిస్తారు. కుయుక్తులు, కుట్రలు అనేవి చంద్రబాబు నైజం అని జగన్‌ ఆక్షేపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఉన్నిక జరగబోతోందని.. అందుకే పార్టీలో అందరు నాయకుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.

అనంతరం.. ఒక్కొక్కరి నుంచి జగన్‌ అభిప్రాయాలు తెలుసుకున్నారు. అందరి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ పేరును ప్రకటించారాయన. అనంతరం.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నాయకులంతా కలిసికట్టుగా పని చేయాలన్నారు. సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని.. అధికార పార్టీ నుంచి బెదిరింపులు ఉంటాయని.. వాటిని థీటుగా ఎదుర్కొనేలా అందరూ కలిసి ముందుకు సాగాలని పిలుపు ఇచ్చారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)