Breaking News

‘భావితరాలకు ఏం సమాధానం చెబుతారు?’

Published on Fri, 11/01/2024 - 15:32

ఆరు కోట్ల మంది ఆంధ్రుల్ని అవమానించారు.. యావత్‌ ఆంధ్రప్రదేశ్‌ను అవమానించారు. భావి తరాలకు ఏం సమాధానం చెబుతారు?.

తిరుపతి, సాక్షి:  కూటమి ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం నిర్వహించకపోవడంపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్‌ ఖాతాలో ఆమె ఒక సందేశం ఉంచారు.

‘‘మన చుట్టూ ఉన్న.. తెలంగాణకు అవతరణ దినం ఉంది. కర్నాటకకు అవతరణ దినం ఉంది. తమిళనాడుకు అవతరణ దినం ఉంది. ఒడిశాకు అవతరణ దినం ఉంది. కానీ, చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం వలనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి అవతరణ దినోత్సవం అంటూ లేకుండా పోయింది.

ఇదీ చదవండి: అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం: వైఎస్‌ జగన్‌

‘‘మా జగనన్న ప్రభుత్వంలో  ఐదేళ్ల పాటు నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించాం. అయితే చంద్రబాబు ప్రభుత్వం జిల్లా స్థాయిలో కూడా అవతరణ దినోత్సవరం నిర్వహణ రద్దు చేసింది. పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగాన్ని అవహేళన చేసేలా ఈ నిర్ణయం ఉంది అని ఆర్కే రోజా అన్నారు.

.. ఎంత దారుణం.. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నిర్వహించరా?. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా? చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌.. వీళ్లసలు పాలకులేనా?. ఆంధ్రప్రదేశ్  ఎప్పుడు అవతరించిందని అడిగితే.. భావితరాలకు ఏం సమాధానం చెప్తారు..?. ఆరు కోట్ల మంది తెలుగు ప్రజలను అవమానించినందుకు.. అమరజీవి త్యాగాన్ని అవమానించినందుకు.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇక నుంచి ప్రతీ ఏటా అవతరణ దినోత్సవం తప్పక నిర్వహించాల్సిందే’’ అని ఆమె డిమాండ్‌ చేశారామె.

Videos

రాత్రి వేళ గోడలు ఎక్కుతూ వేటాడుతున్న వింత రాకాసి!

రెండో టీ20లో వైభవ్ కు చాన్స్.. ఇషాన్ కిషన్ అవుట్

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న టీడిపీ గూండాల దౌర్జన్యాలు

ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

చూస్కుందాం...! నువ్వా... నేనా...

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

Photos

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం