Breaking News

సొంత పార్టీ నేతలకు నితిన్‌ గడ్కరీ హెచ్చరిక

Published on Sat, 07/13/2024 - 08:19

పనాజీ: బీజేపీ సీనియర్‌ నేత, కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ శ్రేణులనే సున్నితంగా హెచ్చరించారు. గోవా బీజేపీ రాష్ట్ర కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన పలు అంశాలపై ప్రసంగించారు. ‘కాంగ్రెస్‌ చేసిన తప్పులనే మనం మళ్లీ చేస్తే వారికి మనకు తేడా ఏం ఉండదు. 

బీజేపీ అంటేనే ఒక ప్రత్యేకత కలిగిన పార్టీ. అందుకే మనల్ని ప్రజలు పదే పదే నమ్మి అధికారం కట్టబెడుతున్నారు. రాజకీయాలు సామాజిక, ఆర్థిక సంస్కరణలు తీసుకురావడానికేనని బీజేపీ క్యాడర్‌ తెలుసుకోవాలి. అవినీతి రహిత భారత్‌ కోసం కృషి చేయాలి. ఇందుకోసం మన దగ్గర ఒక ప్రణాళిక ఉండాలి. 

కుల రాజకీయాలు చేయకూడదు. కుల రాజకీయాలు చేస్తే ప్రతిచర్య కూడా గట్టిగా ఉంటుంది’అని 40 నిమిషాల పాటు గడ్కరీ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ సొంతగా మెజారిటీ దక్కించుకోలేకపోయిన నేపథ్యంలో గడ్కరీ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)