Breaking News

నాడు కారుకూతలు.. నేడు పథకాల్లో కోతలు

Published on Wed, 06/26/2024 - 05:37

సాక్షి, హైదరాబాద్‌: ‘నాడు కారుకూతలు, నేడు పథకాల్లో కోతలు’ అన్నట్లుగా సీఎం రేవంత్‌రెడ్డి పాలన సాగుతోందని బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా రేవంత్‌ చేసిన తప్పులను సరిదిద్దుకోలేడని ఆయ న వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. రూ.2 లక్షల రుణమాఫీ, రైతు కూలీలకు రూ.12 వేలు సాయం, మహాలక్ష్మి పథకం, కొత్త రేషన్‌ కార్డులు మొదలుకుని అన్నీ అమలుకాని హామీలను ఇచ్చి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.

రుణమాఫీ వ్యవహారం సినిమా ఫంక్షన్లను తలపిస్తోందని నిరంజన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. రుణ మాఫీ జరగకుండానే సంబురాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ గెలుపునకు బీఆర్‌ఎస్‌ సహకరించిందని కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలపై మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలోనే బీజేపీకి ఎక్కు వ ఓట్లు వచ్చాయని, బీజేపీని నిలువరించడంలో కాంగ్రెస్‌ విఫలమైనందునే కాంగ్రెస్‌ అధిష్టానం తెలంగాణ ఫలితాలపై విచారణ కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. మీడియా సమావేశంలో మాజీ ఎంపీ లింగయ్య యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)