Breaking News

అలిగిన లోకేష్‌..!సన్నిహితుల వద్ద తీవ్ర ఆవేదన

Published on Tue, 01/28/2025 - 10:37

సాక్షి,విజయవాడ:డిప్యూటీ సీఎం పదవి రాకపోవడంతో మంత్రి నారా లోకేష్‌ అలకబూనినట్లు ప్రచారం జరుగుతోంది. లోకేష్‌ డిప్యూటీ సీఎం ఆశలపై బీజేపీ అగ్రనేత,కేంద్ర హెం మంత్రి అమిత్‌షా నీళ్లు చల్లినట్లు తెలుస్తోంది. తనను డిప్యూటీ సీఎం చేయడానికి అమిత్‌ షా ఒప్పుకోలేదని లోకేష్‌ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. 

లోకేష్‌,పవన్‌కల్యాణ్‌ మధ్య జరిగిన పోరులో లోకేష్‌ పరాజయం పాలయ్యారని కూటమి వర్గాలు అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి. ఇందుకే లోకేష్‌ అలిగి పార్టీ పదవి వదులుకున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబునే టార్గెట్‌ చేసి లోకేష్‌ పార్టీ పదవిని వదులుకున్నట్లు తెలుస్తోంది.

లోకేష్‌ ప్రభుత్వంలో పార్టీలో సూపర్‌పవర్‌గా ఉండాలని చంద్రబాబు భావించారు. అయితే తమ ప్లాన్‌ పారకపోవడంతో వారు తీవ్ర ఆవేదన చెందుతున్నట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇటీవల దావోస్‌ పర్యటనలోనూ చంద్రబాబు లోకేష్‌ను ఆకాశానికెత్తిన విషయం తెలిసిందే.

కాగా, ఇటీవల లోకేష్‌ను సీఎం చేయాలంటూ టీడీపీలో సీనియర్లతో పాటు ముఖ్యనేతలంతా ప్రెస్‌మీట్లు పెట్టి మరీ డిమాండ్‌ చేశారు. లోకేష్‌ యువగళం వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందని పొగడ్తలు కురిపించారు. వీటికి కౌంటర్‌గా అటు జనసేన నేతలు తమ నేత పవన్‌కల్యాణ్‌ను సీఎం చేయాలని మాట్లాడే దాకా వెళ్లారు.

దీంతో కూటమిలో టీడీపీ, జనసేనల మధ్య లోకేష్‌ డిప్యూటీ సీఎం అంశం చిచ్చుపెట్టేదాకా వెళ్లింది. చివరికి అమిత్‌షా మోకలడ్డడంతో లోకేష్‌కు అసంతృప్తి మిగిలి పవన్‌దే పైచేయి అయిందన్న ప్రచారం జరుగుతోంది.

నారా లోకేశ్ అలకకు కారణమేంటి?

 

Videos

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)