Breaking News

‘టీడీపీ ఆఫీసులోనే స్క్రిప్ట్ రెడీ అవుతోంది’

Published on Sat, 06/20/2026 - 15:35

సాక్షి, తాడేపల్లి: కారుమూరి కుటుంబాన్ని వేధించటానికే అక్రమ కేసులు పెడుతున్నారంటూ చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. లేని మద్యం స్కాంలో కారుమూరి సునీల్‌ని అక్రమంగా అరెస్టు చేశారంటూ ధ్వజమెత్తారు. ‘‘బీసీల అణచివేతకే సునీల్ అరెస్టు. అసలు మద్యం రవాణాలో అక్రమాలు జరిగాయని ఏ అధికారైనా చెప్పారా?’’ అంటూ నాగార్జున యాదవ్‌ ప్రశ్నించారు.

కాగ్ లాంటి‌ సంస్థలు ఏమైనా అభ్యంతరం తెలిపాయా?. శాఖాపరమైన విచారణ ఏమైనా జరిగిందా?. అవేమీ లేకుండానే విజిలెన్స్ విచారణకు ఎలా ఆదేశించారు?. సాయిశ్రీనివాస్ అనే టీడీపీ కార్యకర్త ఫిర్యాదు చేయగానే గంటలోనే విజిలెన్స్ విచారణకు ఆదేశించటం దుర్మార్గం. దమ్ముంటే నారా లోకేషే ఫిర్యాదు చేయొచ్చుగా?. నారా లోకేష్ ఆధ్వర్యంలోనే ఈ మొత్తం ఎపిసోడ్ జరుగుతుంది. ఫిర్యాదు, విచారణ ఎలా జరగాలో టీడీపీ ఆఫీసులోనే స్క్రిప్టు రెడీ అవుతోంది’’ అని నాగార్జున యాదవ్‌ పేర్కొన్నారు.

‘‘వైఎస్‌ జగన్ హయాంలో పారదర్శకంగానే రవాణా టెండర్లు జరిగాయి. తక్కువ ప్రైస్ చూపిన వారికే టెండర్లు దక్కాయి. అందులో నేరం ఏం ఉంది?. కేవలం కారుమూరి కుటుంబాన్ని వేధించటానికే అక్రమ కేసు పెట్టారు. అక్రమ కేసులకు సోషల్ మీడియా కార్యకర్తలే భయపడలేదు. ఇక పార్టీ నాయకులు, కార్యకర్తలు భయపడతారా?’’ అంటూ నాగార్జున యాదవ్‌ వ్యాఖ్యానించారు. 

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)