Breaking News

ప్రజాగళం: చంద్రబాబు ఫ్రస్టేషన్‌ పీక్స్‌లో..

Published on Sat, 03/30/2024 - 05:24

కావలి/కోవెలకుంట్ల: ఏపీ పోలీసులపై ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలీసుల కంటే హంతకులే నయమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి, నంద్యాల జిల్లా బనగానపల్లెల్లో శుక్రవారం నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘ప్రభుత్వానికి ఎదురు తిరిగితే పోలీసులు వస్తారు. కేసు పెడతారు. తర్వాత సీబీసీఐడీ వారు వస్తారు. వాళ్లు అరెస్ట్‌ చేస్తారు. జైల్లో పెడతారు. జైల్లో కొడతారు. టార్చర్‌ చేస్తారు. కొంతమంది పోలీసులు చంపేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు’ అంటూ పోలీసుల ఆత్మగౌరవాన్ని, నిబద్ధతను కించపరిచేలా మాట్లాడారు. ఇక.. అధికారం కోసం మళ్లీ ఆయన ఇస్తు‍న్న ఎన్నికల హామీలపై సెటైర్లు పడుతున్నాయి.

అధికారంలోకి వస్తే ‘వర్క్‌ ఫ్రం హోం’ తీసుకొస్తానని చంద్రబాబు అన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌(ఈ స్కాంలోనే ఆయన అరెస్టైంది)తో అందరికీ ఉద్యోగావకాశాలు కల్పిస్తానన్నారు. వ్యవసాయానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని జత చేసి లాభాల బాట పట్టిస్తానన్నారు. ఒకప్పుడు ఏ నోటితో అయితే వలంటీర్లను విమర్శించారో.. ఇప్పుడు అదే వలంటీర్లపై వరాల జల్లు కురిపించే యత్నం చేస్తున్నారు. అధికారంలోకి వస్తే వలంటీర్లను తొలగించబోమని చెప్పారు.

మళ్లీ అరిగిపోయిన రీల్‌ వేసి.. హైదరాబాద్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేసింది తానేనన్నారు. హైటెక్‌ సిటీ, ఔటర్‌రింగ్‌రోడ్, విమానాశ్రయం అంటే తన పేరే గుర్తుచేసుకుంటారని చెప్పారు. టెక్నాలజీ, సెల్‌ఫోన్లు, పవర్‌ సెక్టార్‌ తన చలువేనన్నారు.  

బస్సులోనే పడిగాపులు: సభకు జనాలు రాకపోవడంతో చంద్రబాబు గంటకుపైగా బస్సులోనే పడిగాపులు పడాల్సి వచ్చింది. దీంతో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన ప్రజాగళం గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఒక్కొక్కరికి రూ. 500 వంతున ఇచ్చి తీసుకువచ్చిన జనాలు కూడా చంద్రబాబు ప్రసంగిస్తుండగానే వెనుదిరిగారు.

కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డిపై అసంతృప్తితోనే పార్టీ నేతలు, కార్యకర్తలు సభకు ముఖం చాటేశారని చెబుతున్నారు. ఆటోల్లో తీసుకువచ్చిన జనాలకు ‘రాజరాజేశ్వరి ఐస్‌’ కంపెనీ పేరుతో ఉన్న స్లిప్పులను సభాస్థలి వద్దే పంపిణీ చేశారు. వెళ్లేటప్పుడు స్లిప్‌ ఇచ్చి రూ.500 తీసుకోవాలని సూచించారు. పోలీసులు, ఎన్నికల నిఘా సిబ్బంది ముందే స్లిప్పులు పంపిణీ చేస్తున్నా ఎవరూ అడ్డుకోకపోవడం గమనార్హం. 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)