Breaking News

చంద్రబాబూ.. కట్టుబట్టలతో కాపులను వెళ్లగొట్టండి

Published on Mon, 02/02/2026 - 09:52

సాక్షి, కాకినాడ: చంద్రబాబు అనే వ్యక్తి ఎప్పుడూ కాపుల మీద రగిలిపోతూనే ఉంటారని.. అందుకే రిజర్వేషన్ల విషయం సహా ప్రతీ దాంట్లోనూ మోసం చేస్తూ వస్తున్నారని కాపు ఉద్యమ నేత, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం అంటున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడి నేపథ్యం, రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌కు ముద్రగడ సోమవారం ఓ బహిరంగ లేఖ రాశారు. 

‘‘రాష్ట్రంలో గాడితప్పిన రాక్షస పాలనలో దహనకాండను చూస్తున్నాను. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, జోగి రమేష్ లను ఘోరాతి ఘోరంగా అవమానించడం ఎంత వరకు న్యాయం?. తిరుపతి లడ్డూలో కల్తీ జరగలేదని సీబీఐ ఇచ్చిన నివేదికతో గతంలో మీరు చెప్పింది అబద్దమని తేలిపోయింది. దానిని కప్పిపుచ్చుకోవడానికి  మీరు పడుతున్నపాట్లు అంతా ఇంతా కాదు. మీరు చెప్పిన అబద్దానికి మీ పార్టీనే ఎంతో నష్టపోయింది.. 

.. మీ పరిపాలనలో ఎంతసేపూ కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారు. గతంలో నా కుటుంబాన్ని, ఇప్పుడు అంబటి కుటుంబాన్ని అవమానాలకు గురి చేశారు. కాపుల మీద మీరు ఎప్పుడూ రగిలిపోతునే ఉన్నారు. గతంలో కాపులకు రిజర్వేషన్‌లు ఇస్తానని హమీ ఇచ్చి మొండి చెయ్యి చూపించారు. డిప్యూటీ సీఎం(పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి..) మీద ప్రేమతో మళ్ళీ కాపులు మీకు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు కాపులంతా మీ మీద కోపంతో ఉన్నారు. దయచేసి కాపులను ఈ రాష్ట్రం నుండి వేరే రాష్ట్రానికి కట్టుబట్టలతో పంపించే కార్యక్రమం చేయ్యండి’’ అంటూ చంద్రబాబు, లోకేష్‌ను ఉద్దేశించి ముద్రగడ పద్మనాభం లేఖలో పేర్కొన్నారు.

 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)