మోసాల బాబూ.. డ్రామాలు ఇక ఆపు: కేశినేని నాని

Published on Fri, 03/08/2024 - 11:30

సాక్షి, విజయవాడ: అభివృద్ధిపై చంద్రబాబుతో ఎక్కడైనా చర్చించేందుకు తాను సిద్దమంటూ సవాల్‌ విసిరారు ఎంపీ కేశినేని నాని. గొల్లపూడిలోని మౌలానగర్‌లో డా.వైఎస్సార్‌ మైనారిటీ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాటు ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మైలవరం నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి సర్నాల తిరుపతిరావు, మైలవరం నియోజకవర్గ పరిశీలకులు అప్పిడి కిరణ్ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కేశినేని మాట్లాడుతూ, గొల్లపూడికి దేవినేని ఉమా, వసంత చేసిందేమీ లేదన్నారు. వాళ్లు ఎమ్మెల్యేలుగా ఉన్న సమయంలో తాను ఒక్కసారి కూడా ఎలాంటి శంకుస్థాపన కార్యక్రమాలకు రాలేదన్నారు. 15 లక్షల జనాభా ఉన్న విజయవాడకు చంద్రబాబు వంద కోట్లు కూడా ఇవ్వలేదని, ఫ్లైఓవర్లు.. రోడ్లకు కూడా తానే ఎంపీగా డబ్బులు తెచ్చానని కేశినేని అన్నారు.

‘‘గొల్లపూడికి సీఎం జగన్‌ రూ. 210 కోట్ల సంక్షేమాన్ని అందించారు. 40 వేల మంది ఉన్న గొల్లపూడిని రూ. 60 కోట్లతో తలశిల రఘురాం అభివృద్ది చేశారు. చంద్రబాబుకు మైనార్టీలంటే పడదు. చంద్రబాబు వంటి మోసగాడిని నమ్మొద్దు. బీజేపీతో చంద్రబాబు ఆడుతున్న నాటకాలను మైనార్టీలంతా గమనించాలి. 2018 సంవత్సరంలో చంద్రబాబు ఆదేశాల మేరకు నేనే ప్రధాని మోదీపై అవిశ్వాస తీర్మానం పెట్టా. ఆ రోజు ప్రధాని మోదీని తిట్టాడు.. ఇప్పుడు మళ్లీ ఆయన చుట్టూ తిరుగుతున్నాడు’’ అంటూ కేశినేని నాని దుయ్యబట్టారు.

ఓట్ల కోసం మైనార్టీలను చంద్రబాబు ఎలా వాడుకున్నాడో అందరికీ చెప్పాలి. నా అమరావతి అని చెప్పుకునే చంద్రబాబు ఒక్క సెక్రటేరియట్ కట్టలేకపోయాడు. సీఎం జగన్‌ 30 వేల కోట్లతో రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో సచివాలయాలు కట్టించారు. 175కి 175 స్థానాలు వైఎస్సార్‌సీపీ గెలవడం ఖాయం’’ అని కేశినేని నాని చెప్పారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)