Breaking News

వాలంటీర్లపై ‘పచ్చ’ కుట్ర.. చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ నేతల ఫైర్‌

Published on Sat, 03/30/2024 - 21:58

సాక్షి, విజయవాడ: పెన్షన్ పంపిణీపై నిమ్మగడ్డ అండ్ కో ఫిర్యాదుపై ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్‌, మల్లాది విష్ణు మండిపడ్డారు. సీఎం జగన్‌ చెప్పినట్లు పేదలకు, పెత్తందార్లుకు మధ్య జరుగుతున్న యుద్ధం అన్నారు. పేదలకు అందించే పెన్షన్లు నిలుపుదల చేయించడం దురదృష్టకరమన్నారు. పెన్షన్ల పంపిణీ అంశంపై ఈసీ పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. 

లబ్ధిదారులు ఇబ్బందులు పడతారు: ఎంపీ కేశినేని
పెన్షన్లు ఆపేస్తే లబ్ధిదారులు ఇబ్బంది పడతారన్నారని ఎంపీ కేశినేని నాని అన్నారు. మొన్నటి వరకూ ఒకటవ తేదీనే పెన్షన్ ఇచ్చేవాళ్లం. ఆ విధానాన్ని కొనసాగించేలా ఈసీ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

పెన్షనర్ల నోట్లో మట్టికొట్టారు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, 64 లక్షల మంది పెన్షనర్ల నోట్లో మట్టికొట్టారన్నారు. నిమ్మగడ్డ రమేష్‌తో పాటు మరికొందరు చంద్రబాబు ఏజెంట్లుగా.. తొత్తులుగా మారారని దుయ్యబట్టారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే  పెన్షన్లను అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. దీనికి టీడీపీ కచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిందేనన్నారు.

వృద్ధుల ఉసురు పోసుకున్న చంద్రబాబు: వెల్లంపల్లి శ్రీనివాస్‌
ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, నిమ్మగడ్డ రమేష్ అండ్ బ్యాచ్ రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్నారు. చంద్రబాబు పాలనలో మూడు రోజులు క్యూలో నిలబడితేనే కానీ పెన్షన్లు వచ్చేవి కాదు. ఈ కుట్రకు కారణం చంద్రబాబే. వృద్ధుల ఉసురు చంద్రబాబుకు కచ్చితంగా తగులుతుంది. సీఎం జగన్‌ ఇంటికే పెన్షన్లు అందిస్తున్నారు. వాలంటీర్ల ద్వారా ఇంటికే పెన్షన్ల ప్రక్రియను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)