Breaking News

‘బండి సంజయ్‌.. నువ్వు కార్పొరేటర్‌ కాదు కేంద్రమంత్రి’

Published on Wed, 01/29/2025 - 16:39

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ నాయకుడు బండి సంజయ్‌ కార్పొరేటర్‌ కాదు.. కేంద్రమంత్రి అని గుర్తు పెట్టుకోవాలని చురకలంటించారు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి. పద్మా అవార్డుల విషయంలో బండి సంజయ్‌ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని మండిపడ్డారు. ఇదే సమయంలో జరగబోయే బడ్జెట్‌ సమావేశాల్లో అయినా బీజేపీ ఎంపీలు విభజన హామీల గురించి మాట్లాడాలని డిమాండ్‌ చేశారు.

ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్‌ కేంద్రమంత్రి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎలా పడితే అలా మాట్లాడటానికి ఆయనేం కార్పొరేటర్‌ కాదు. పద్మశ్రీ అవార్డుల విషయం పార్లమెంట్ జీరో అవర్‌లో లేవనెత్తుతాను. అవార్డుల విషయంలో బండి సంజయ్‌ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. తెలంగాణ ప్రజలు ఎనిమిది మంది బీజేపీ నేతలను ఎంపీలుగా గెలిపించారు. మిమ్మల్ని గెలిపించింది ఎందుకు?. జరగబోయే బడ్జెట్‌ సమావేశాల్లో అయినా బీజేపీ ఎంపీలు విభజన హామీల గురించి మాట్లాడాలన్నారు. 

కేంద్రం బీహార్‌, ఏపీకి ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణకు ఇవ్వట్లేదు. అందుకే బడ్జెట్‌లో మొండి చేయి చూపిస్తున్నారు. కిషన్ రెడ్డి దావోస్ పర్యటనను, కంపెనీలపై నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని సార్లు ఢిల్లీకి వెళ్లారో కేటీఆర్‌ను అడిగితే వ్యంగ్యంగా చెప్పాడు. ఆదిలాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీని రాష్ట్రానికి పెద్దన్నలాగా ఉండమన్నారు. హైదరాబాద్ ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం కేంద్ర మంత్రి గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. హైదరాబాద్‌ లైఫ్‌ లైన్‌ ఆర్‌ఆర్‌ఆర్‌కు 45వేల కోట్లు అవసరం. ఆర్‌ఆర్‌ఆర్‌, మెట్రోతో హైదరాబాద్ గ్లోబల్ సిటీ అవుతుందన్నారు. 

నల్లగొండలో రైతులు ఎవ్వరు కేటీఆర్ ధర్నాను పట్టించుకోలేదు. మూసీ ప్రాజెక్ట్‌ కోసం తెలంగాణ ఎంపీలందరూ పార్లమెంట్‌లో కొట్లాడాలి. మహారాష్ట్ర కంటే మన రాష్ట్రం ఎక్కువగా కేంద్రానికి జీఎస్టీ పన్నులు కడుతోంది. పదేళ్లు రాష్ట్రానికి రావాల్సిన నిధులను రప్పించడంలో బీఆర్ఎస్ విఫలమైంది. హరీష్ రావు ముందు కేసీఆర్‌ను ప్రజలకు దర్శనం ఇవ్వాలని చెప్పాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)