Breaking News

నవీన్‌యాదవ్‌ రాత మార్చిన ‘న‌వంబ‌ర్‌’

Published on Fri, 11/14/2025 - 20:11

సాక్షి, హైదరాబాద్‌: హోరాహోరీగా సాగిన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోరులో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్ ఘన విజయం సాధించారు. నవంబర్‌ నెల ఆయన రాత మార్చేసింది. నవీన్‌ యాదవ్‌ 1983 న‌వంబ‌రు 17న పుట్టారు. 2023 నవంబ‌రు 15న కాంగ్రెస్‌లో చేరారు. 2025 న‌వంబ‌రు 14నే కాంగ్రెస్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడం విశేషం.

అధికార పార్టీ కావడంతో పలువురు సీనియర్లు, హేమాహేమీలు పోటీ పడినప్పటికీ.. యువ నేత అభ్యర్థితానికి కాంగ్రెస్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ ఉప ఎన్నికలను రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గతంలో జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ స్థానం నుంచి నవీన్‌ యాదవ్‌ రెండు పర్యాయాలు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్‌ పక్షాన పోటీ చేసి 41వేల 656 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు.

ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో మజ్లిస్‌ ఎన్నికల బరికి దూరం పాటించడంతో.. ఆ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 18వేల 817 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరినా.. పార్టీ టికెట్‌ దక్కలేదు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే మృతితో ఉప ఎన్నిక అనివార్యం కావడంతో అవకాశం దక్కింది. ఈ ఉప ఎన్నికలో నవీన్‌ యాదవ్‌ భారీ మెజార్టీతో విజయం సాధించారు.

పేరు: వల్లాల నవీన్ యాదవ్
తండ్రి పేరు: వి.చిన్న శ్రీశైలం యాదవ్
వయసు: 42 సంవత్సరాలు
విద్యార్హతలు: బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్ట్
రాజకీయ అరంగ్రేటం: మజ్లిస్
ఎన్నికల్లో పోటీ:
2014లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.
2018లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు.
2023లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిక
2025లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో విజయం

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)