Breaking News

మేం ‘పింక్‌ బుక్‌’ రాస్తున్నాం.. ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

Published on Fri, 02/28/2025 - 15:18

సాక్షి, హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) ప్రత్యర్థి పార్టీల నేతలకు, అధికారులకు వార్నింగ్‌ ఇచ్చారు.  మేం పింక్ బుక్ (pink book) రాస్తున్నాం. కార్యకర్తలపై దాడులు చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోం’ అని హెచ్చరించారు. 

నాగర్ కర్నూల్ జిల్లాలో శుక్రవారం బీసీల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ (brs) నాయకులు ఎమ్మెల్సీ కవిత, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ‘బీసీలకు విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో 46 శాతం రిజర్వేషన్లకు వేర్వేరుగా 3 బిల్లులు పెట్టాలి. మూడింటికి ఒకే బిల్లు పెడితే కోర్టుల్లో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి.

కాంగ్రెస్ చేపట్టిన కుల గణన సర్వే తప్పుడు తడకగా ఉంది. 2014 కేసీఆర్ (kcr) జరిపిన సర్వేలో బీసీలు 52 శాతం ఉన్నట్లు తేలింది. నేటి కాంగ్రెస్ సర్వే 46 శాతం బీసీలు ఉన్నట్లు చెబుతోంది. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా బీసీ హక్కులకు రాజ్యాంగ రక్షణ రాకపోవడం బాధాకరం. బీసీలకు రాజ్యాంగ రక్షణ కల్పించి ఉంటే అభివృద్ధిలో భారత్ అమెరికాను మించిపోయేది’అని వ్యాఖ్యానించారు.

మరోవైపు, నాగర్‌ కర్నూల్‌ సొంత జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ‘సింగోటం ఆలయ అభివృద్ధి కోసం మాజీ సీఎం కేసీఆర్ రూ.15 కోట్లు కేటాయించారు. దేవుడికిచ్చిన డబ్బులను జూపల్లి కృష్ణారావు క్యాన్సిల్ చేయించారు. ఆలయ అభివృద్ధికి కేటాయించిన రూ.15 కోట్లను క్యాన్సిల్ చేయడం దారుణం. 

జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ నాయకుల మీద కక్ష్య గట్టి కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారు.  పలు హత్య కేసుల్లోని హంతకులకు కొమ్ము కాస్తున్నారు. జూపల్లి నియోజకవర్గానికి రావాలి. టూరిజం మంత్రిలా కాకుండా టూరిస్ట్‌లా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గానికి రావడం లేదు. మేం పింక్ బుక్ మెయింటైన్ చేస్తాం. కార్యకర్తలపై దాడులు చేసిన వారు నాయకులైనా, అధికారులైనా ఉపేక్షించేది లేదని’ స్పష్టం చేశారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)