Breaking News

ప్రజల ఆశీర్వాదంతో మరోసారి అధికారంలోకి వస్తాం 

Published on Fri, 09/29/2023 - 02:21

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్‌ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని, ప్రజల ఆశీర్వాదంతో బీఆర్‌ఎస్‌ మరోసారి అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ మోసపూరిత హామీలు ఇస్తోందని, తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని జోస్యం చెప్పారు. గురువారం పీటీఐ వార్త సంస్థ ఇంటర్వ్యూలో కవిత బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలపై విమర్శలు గుప్పించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలను తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తారని తేల్చి చెప్పారు.

కాంగ్రెస్‌ మోసపూరిత హామీలు ఇ చ్చిందని, ఆ పార్టీ మాటలు నమ్మశక్యం కావన్నారు. గత 10 ఏళ్లలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదని, ప్రధాని మోదీకి తెలంగాణ అంటే ఎందుకు కక్షనో అర్థం కావడం లేదన్నారు. తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంటులో మోదీ అంత పెద్ద మాట అంటే కాంగ్రెస్‌ నాయకులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను గవర్నర్‌ తిరస్కరించడంపై స్పందిస్తూ గవర్నర్‌ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రధాని మోదీ ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, ఏ రాష్ట్రంలో చూసినా ఇదే వైఖరిని అవలంబిస్తున్నారని కవిత విమర్శించారు.

ఇలాంటి చర్యలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం అన్నది గుర్తుంచుకోవాలన్నారు. రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేస్తోందని తెలిపారు. కేంద్రం తలుచుకుంటే అమలు చేయవచ్చని కానీ బీజేపీ ప్రభుత్వం అమలు చేయబోదని మహిళలకు అర్థమైందని, మహిళా బిల్లు సాధనకు ఉద్యమించిన తరహాలో త్వరగా అమలు చేయాలని కూడా ఉద్యమిస్తామని ప్రకటించారు. ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లలో కోటా కోసం కూడా మా పోరాటం సాగుతుందని కవిత తెలిపారు.   

‘ప్రజల మేలు కోరి సమర్థించి తీరుతాం’
సాక్షి, హైదరాబాద్‌: ‘తెలంగాణ సమాజంలో అత్యధిక ప్రజల ధోరణి ఈ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని వదిలించుకోవాలి. ఈ దొరహంకార దుర్మార్గ పరిపాలన అంతం కావాలి అని కోరుకుంటున్నట్టు అభిప్రాయం వినబడుతున్నది’అని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యురాలు విజయశాంతి ఎక్స్‌(ట్విట్టర్‌)లో పేర్కొన్నారు. పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, తాము జరుపుతున్న భేటీలపై ఆమె పరోక్షంగా స్పందిస్తూ గురువారంరాత్రి ఈ ట్వీట్‌ చేశారు. ఈ నిజమైన ప్రజాభావాలను దశాబ్దాల తెలంగాణ ఉద్యమకారిణిగా ప్రజల మేలు కోరుతూ సమర్థించి తీరుతానని పేర్కొన్నారు.

‘గత కొన్నిరోజులుగా సమావేశమవుతున్న బీజేపీ నేతలందరం.. ప్రజాకంటక బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని బీజేపీ తొలగించగలదనే విశ్వాసంతోనే బీజేపీలో చేరినం. అందుకు మేం సాధ్యమైనంతవరకు అన్నివిధాలుగా ప్రయత్నించడం సహజం. పార్టీకి కూడా అదే తెలియజేసినం. నిజానిజాలు తెలుసుకోగలిగిన విజ్ఞత తెలంగాణ బిడ్డలకు ఎప్పుడూ ఉంటుందని నా విశ్వాసం. ఇదే సత్యం’అని విజయశాంతి ట్వీట్‌ చేశారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)