Breaking News

స్టీల్‌ ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వ వైఖరి చెప్పాలి: బొత్స

Published on Sat, 08/23/2025 - 12:38

సాక్షి, విశాఖ: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వ వైఖరి చెప్పాలని డిమాండ్‌ చేశారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో దివ్యాంగులు ధర్నా చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అసలు కూటమి ప్రభుత్వానికి మానవత్వం ఉందా? అని ప్రశ్నించారు.

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో కూటమి నేతల దౌర్జన్యాలు పెరిగిపోయాయి. మంత్రులు, ఎమ్మెల్యేలపైనా అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయి. దోచుకోవడంలో కూటమి నేతలు బిజీగా ఉన్నారు. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్‌ అయ్యారని చెబుతారు కానీ.. చర్యలు మాత్రం ఉండవా? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. దోపిడీలు దౌర్జన్యాలు భూ కబ్జాలు పెరిగిపోయాయి.అర్హత కలిగిన వికలాంగుల పెన్షన్లు తొలగిస్తున్నారు. వికలాంగులను తీసుకొని కలెక్టర్లను కలుస్తాం. ఈనెల 30 లోపు సమస్య పరిష్కరించాలి. రాష్ట్రంలో దివ్యాంగులు ధర్నా చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అసలు కూటమి ప్రభుత్వానికి మానవత్వం ఉందా?. దివ్యాంగుల తరఫున కూడా వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందన్నారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని శాసనమండలి సాక్షిగా పవన్ కళ్యాణ్, లోకేష్ చెప్పారు. 32 విభాగాలను ఎందుకు ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారు. ఎన్నికల ముందు కూటమి నేతలు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగదని చెప్పారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వ వైఖరి చెప్పాలి. vదేశంలో ఎక్కడా లేనివిధంగా ఎందుకు జరుగుతుంది. ఈనెల 30 తేదీన విశాఖలో జరిగే జనసేన సమావేశంలో  స్టీల్ ప్లాంట్‌పై పవన్ కళ్యాణ్ తన వైఖరి చెప్పాలి. ప్రధాని విశాఖ పర్యటన సందర్భంగా గిన్నిస్ బుక్ గురించి ఆలోచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడలేదు. చంద్రబాబు, పవన్‌కు ప్రధానిని అడిగే బాధ్యత లేదా?. రాజకీయ, ప్రజా కార్మిక సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. స్టీల్ ప్లాంట్‌పై త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. అవసరమైతే ప్రధాని దగ్గరకు వెళ్తాం. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం కార్మిక సంఘాలతో కలిసి వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తోంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకోవాలి. ప్రైవేటీకరణకు వ్యతిరేక పోరాటానికి అందరూ కలిసి రావాలి’ అని పిలుపునిచ్చారు. 

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్ ఎన్నికకు సంఖ్య బలం ఉన్నపుడు పోటీ పెట్టడానికి వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం. ప్రణబ్ ముఖర్జీ, రాంనాథ్ కోవింద్, వెంకయ్య నాయుడు, కోడెల శివ ప్రసాద్ ఎన్నికకు మద్దతు తెలిపాం. ఇండియా కూటమి అభ్యర్థి జడ్జిగా ఉన్నప్పుడే చంద్రబాబుకు సైకిల్ సింబల్ వచ్చిందనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. చంద్రబాబు ఇండియా కూటమి అభ్యర్థికి సపోర్టు చేస్తారా? అని ప్రశ్నించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)