Breaking News

‘చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు’

Published on Tue, 02/06/2024 - 16:07

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని వైఎస్సార్‌సీపీ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. సీఎం జగన్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి మంగళవారం అసెంబ్లీలో మాట్లాడారు.

‘సీఎం జగన్‌ రూ.2లక్షల 53 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశారు. ఎన్నికల్లో ఎలా లబ్ధి పొందాలో ప్రతిపక్షం ఆలోచిస్తోంది. నాయకుడికి ఉండాల్సిన లక్షణం చంద్రబాబుకు లేదు. మీకు మంచి జరిగితేనే నాకు అండగా నిలబడండి అని సీఎం జగన్ చెప్పారు.నాయకత్వం అంటే సీఎం జగన్‌ది.మేనిఫెస్టోలోని ప్రతి హామీని సీఎం జగన్ నెరవేర్చారు.

సీఎం జగన్ పాలనలో పేదరికం తగ్గింది. కరోనా కష్టకాలంలో కూడా పేదవాడికి తోడుగా సీఎం జగన్ నిలబడ్డారు. అర్హుడైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పేదలకు మంచి చేసింది కనుకనే ఈరోజు ధైర్యంగా చెప్పుకుంటున్నాం’ అని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. 
 
‘పేదవాడు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే చంద్రబాబుకు కడుపుమంట. రాజకీయమే అజెండాగా చంద్రబాబు ప్రవర్తిస్తుంటారు. మాటలతో మభ్యపెట్టే చంద్రబాబుని ప్రజలు నమ్మరు. చంద్రబాబుకు ఎందుకంత ద్వేషం? చంద్రబాబు చెప్పుకునేందుకు ఓ మంచి పథకం ఉందా?. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు’ అని శ్రీకాంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)