Breaking News

‘వాళ్ల చేతులకు బేడీలేవీ?.. నిరసనల్లోనూ దురహంకారమేనా?’

Published on Tue, 12/17/2024 - 14:55

హైదరాబాద్, సాక్షి: అసెంబ్లీలో ఇవాళ నల్ల దుస్తులు, చేతులకు బేడీలతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చేపట్టిన నిరసనపై మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిరసనల్లోనూ బీఆర్‌ఎస్‌లో సమానత్వమే లేదని అన్నారామె. అసెంబ్లీ లాబీలో మీడియా చిట్‌చాట్‌లో ఆమె మాట్లాడుతూ.. 

‘‘కేటీఆర్‌, హరీష్‌ రావుల దొరతనం మరోసారి బయటపడింది. నిరసనల్లోనూ వాళ్లు తమ దురహంకారాన్ని ప్రదర్శించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు బేడీలు వేశారే తప్ప వాళ్లు వేసుకోలేదు. కనీసం వాళ్ల నిరసనల్లోనూ సమానత్వం లేదనే విషయం బయటపడింది’’ అని అన్నారామె. అలాగే.. 

లగచర్ల రైతుకు బేడీల వ్యవహారంపై సీఎం రేవంత్‌ రెడ్డి సీరియస్‌ అయ్యారు. సంబంధిత అధికారులపై చర్యలు కూడా తీసుకున్నారు. కానీ, బీఆర్‌ఎస్‌ హయాంలో కనీసం పదిసార్లు అయినా రైతులకు బేడీలు వేసి ఉంటారు. ఆ టైంలో అధికారులపై కనీస చర్యలు కూడా తీసుకోలేదు. ఆ లెక్కన ఇప్పుడు రైతులకు బేడీలు వేశారంటూ మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్‌ లేనేలేదు. 

గతంలో.. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగా వెల్‌లోకి వెళ్తే సభ నుంచి సస్పెండ్‌ చేసేవాళ్లు. కానీ, ఇప్పుడు వాళ్లు పెట్టిన నిబంధనలనే వాళ్లు కాలరాస్తున్నారు. అయినా సభలో వాళ్ళు పెట్టిన రూల్స్ పై వాళ్ళే అభ్యంతరం చెప్పడం ఏంటో? అని సీతక్క అన్నారు. 

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు