Breaking News

‘బినామీలు బయటపడతారు.. అదే చంద్రబాబు భయం’

Published on Sun, 05/05/2024 - 13:31

సాక్షి, తూర్పుగోదావరి: ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని.. ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారని మంత్రి వేణు గోపాలకృష్ణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టైట్లింగ్‌ యాక్ట్‌పై ఇంకా రూల్స్‌ తయారు కాలేదన్నారు.

‘‘భూములన్నీ లాక్కుంటున్నారని విష ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలు.. బినామీలు బయటపడతారని చంద్రబాబు భయపడుతున్నారు. అందుకే కుటిల రాజకీయాలు చేస్తున్నారు’’ అంటూ మంత్రి వేణు ధ్వజమెత్తారు.

‘‘అమరావతి పేరుతో అసైన్డ్ భూములను, ఎస్సీల భూములను చంద్రబాబు గుంజుకున్నాడు. చంద్రబాబు సిగ్గులేని ప్రకటనలు చేస్తున్నాడు. ఇంకా అమలులోకి రాని చట్టాన్ని ఆయన రద్దు చేస్తాడట. తన పరిధిలో లేని రిజర్వేషన్లను ముందు పెట్టి కాపులను మోసం చేశాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ప్రధానితో చెప్పించగలరా. చంద్రబాబు మాటల్లో స్పష్టత లేదు. వాలంటీర్ల విషయంలో వారికి వ్యతిరేకంగా ఈసీకి ఫిర్యాదు చేసింది ఎవరు....? చంద్రబాబు కాదా..?’’ అని మంత్రి వేణు ప్రశ్నించారు. 

టీడీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోని బీజేపీ నేతలు ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారంపై ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. కచ్చితంగా సీఐడీ ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకుంటుంది’’ మంత్రి వేణు చెప్పారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)