Breaking News

సింపతీ కోసమే కేటీఆర్‌ అరెస్ట్‌ డ్రామా: శ్రీధర్‌ బాబు

Published on Fri, 11/15/2024 - 13:47

సాక్షి, సచివాలయం: ప్రజల్లో సానుభూతి కోసమే కేటీఆర్‌ పదే పదే అరెస్ట్‌ అంటూ మాట్లాడుతున్నారని అన్నారు మంత్రి శ్రీధర్‌ బాబు. లగచర్ల ఘటనలో కలెక్టర్‌ను చంపే కుట్ర జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. అలాగే, రైతుల విషయంలో ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారం ఆపాలని డిమాండ్‌ చేశారు.

మంత్రి శ్రీధర్ బాబు సచివాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. లగచర్ల ఘటనలో ఎవ్వరనీ వదిలిపెట్టం. దీనిపై విచారణ జరుగుతోంది. రైతుల ముసుగులో కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేస్తున్నాయి. లగచర్ల ఘటనలో కేటీఆర్‌ ఉన్నట్టు వారి పార్టీ నాయకులే అంటున్నారు. కేటీఆర్‌ పదే పదే అరెస్ట్‌ అనడం కేవలం సానుభూతి కోసమే. ఆయనను అరెస్ట్‌ చేయడానికి మేమేమీ కుట్రలు చేయడం లేదు. సీనియర్‌ అధికారి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. విచారణ పూర్తి అయ్యాక అన్ని విషయాలు బయటకు వస్తాయి.

గత పదేళ్లలో రైతులకు అన్యాయం చేసిన బీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తోంది. సన్న వడ్లు పండించిన ధాన్యానికి 500 బోనస్ ఇస్తున్నాం. ధాన్యం సేకరించిన వారం రోజులలోపే ఐదు వందల బోనస్ రైతులకు అందుతాయి. రైతుల విషయంలో ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారం ఆపాలి. ఇప్పటి వరకు 33కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసేందుకు ప్రాసెస్ జరిగింది. 66 లక్షల ఎకరాల్లో 140 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది.

కాళేశ్వరంతోనే నీళ్లు ఇచ్చాం అన్నారు.. మరి ఈ ధాన్యం ఉత్పత్తి కాళేశ్వరంతో కాలేదు కదా?. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేశారు. బీజేపీ తమ బాధ్యతలను విస్మరిస్తోంది. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించాలి. గత ప్రభుత్వ హయంలో గుట్టలకు, పుట్టలకు, చెట్లకు రైతుబంధు ఇచ్చారు. ఇలాంటి విధానాన్ని మేము కొనసాగించం.. నిజమైన రైతులకు న్యాయం చేస్తాం’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)