Breaking News

బీఆర్‌ఎస్‌ ఎవరి చేతుల్లోకి వెళ్లబోతోందో తెలుసుకో కేటీఆర్‌: పొంగులేటి

Published on Thu, 09/18/2025 - 20:11

సాక్షి, ఖమ్మం జిల్లా: జూబ్లీహిల్స్‌ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ సంగతి తెలుస్తుందంటూ కేటీఆర్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాట్‌ కామెంట్స్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ ఎవరి చేతుల్లోకి వెళ్లబోతుందో కేటీఆర్‌ తెలుసుకోవాలన్న పొంగులేటి.. రెండుసార్లు బీఆర్‌ఎస్‌కు ప్రజలు బుద్ధి చెప్పారు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణా రాష్ట్ర ప్రజలు అంతా గమనిస్తున్నారన్నారు

‘‘మీ కుటుంబ సమస్యలను రాష్ట్ర ప్రజల సమస్యగా చిత్రీకరిస్తున్నారు. మూడున్నర సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల గురించి కేటీఆర్‌ మాట్లాడుతున్నాడు. ఇటీవల ఒక మహిళ ఎమ్మెల్యే ప్రమాదంలో మృతి చెందినప్పుడు జరిగిన ఎన్నికల్లో మీ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నో స్థానంలో ఉందొ లెక్క పెట్టుకో..

..త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మీ బీఆర్‌ఎస్‌ పార్టీ స్థానం ఎక్కడ వుంటుందో ఆలోచించుకో. జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మీ పార్టీ పరిస్థితి ఏంటో చూసుకో.. నీ దయా దాక్షిణ్యాలతో బీ ఫామ్ తీసుకున్న వాళ్ళు ఎవరూ లేరు. కేసీఆర్‌.. పాలేరు వచ్చి ముక్కు నేలకు రాసినా ఏం చేయలేక పోయాడు నువ్వెంత’’ అంటూ  కేటీఆర్‌పై పొంగులేటి మండిపడ్డారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)