Breaking News

అప్పులపై బాబు, పవన్‌ డ్రామా బట్టబయలు

Published on Mon, 09/22/2025 - 12:56

సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర అప్పులపై టీడీపీ(TDP) తప్పుడు ప్రచారం మరోసారి బట్టబయలైంది. వైఎస్సార్‌సీపీ హయాంలో అప్పు కేవలం 2,61,683 కోట్లు మాత్రమే అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఎన్నికల ముందు, ఇన్నాళ్లు వైఎస్‌ జగన్‌ హయాంలో అప్పులు 10-14 లక్షల కోట్లు అని టీడీపీ, జనసేన, పచ్చ మీడియా గగ్గోలు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా మంత్రి ప్రకటనతో అసలు విషయం బయటకు వచ్చింది. 

ఏపీలో అసెంబ్లీ సమావేశాల సందర్బంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌(payyavula keshav) లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌ హయాంలో 2,61,683 కోట్లు మాత్రమే అప్పు చేసినట్టు ఒప్పుకున్నారు. జూన్ 12, 2024 నాటికి 5,19,192 కోట్లు అప్పు ఉన్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. కాగా, చంద్రబాబు దిగిపోయే నాటికి 2,57,509 కోట్లు అప్పు ఉందని తెలిపారు. ఇక, కార్పోరేషన్ల ద్వారా గత ఐదేళ్లలో 1,09,217 కోట్లు అప్పు మాత్రమే తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు. వైఎస్సార్‌సీపీ హయాంలో మొత్తంగా 3,70,900 కోట్లు అప్పులు తెచ్చినట్టు ప్రకటించారు. మరోవైపు.. 2024 ఎన్నికలు సమయంలో తెచ్చిన అప్పు సైతం ఇందులో కలిపి ఆర్థిక శాఖ లెక్కలను తాజాగా మంత్రి వెల్లడించారు.

ఇది కూడా చదవండి: డొల్ల మాటలు.. ఊకదంపుడు ఉపన్యాసాలు!

అయితే, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై ఎన్నికల సమయంలో టీడీపీ, పవన్‌(Pawan Kalyan) కల్యాణ్‌ తప్పుడు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. వైఎస్సార్‌సీపీ హయాంలో 10 నుండి 14 లక్షల కోట్లు అప్పు చేసినట్టు పచ్చ మీడియా, చంద్రబాబు, పవన్‌ ప్రచారం చేశారు. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా కూటమి నేతల ఫేక్‌ ప్రచారం బట్టబయలు అయ్యింది. 

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు