Breaking News

ప్రగతి భవన్‌ను పేల్చేయండనడమే కాంగ్రెస్‌ సిద్దాంతమా? కేటీఆర్‌

Published on Thu, 02/09/2023 - 15:14

సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిపై మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు. ప్రగతి భవన్‌ పేల్చేయాలని రేవంత్‌ దుర్మార్గంగా మాట్లాడారని మండిపడ్డారు. ప్రగతి భవన్‌ పేల్చేయండని అనొచ్చా? ఇదేనా కాంగ్రెస్‌ పార్టీ సిద్దాంతం అంటూ విమర్మలు గుప్పించారు. రేవంత్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. శాస‌న‌స‌భ‌లో బ‌డ్జెట్ ప‌ద్దుల‌పై చ‌ర్చ సంద‌ర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

మంత్రి మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు, భట్టి విక్రమార్క ఇద్దరూ మంచి వాళ్లే. సావాస దోషం వల్ల ఇద్దరూ అసెంబ్లీలో అస్య ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ అధ్య‌క్షుడేమో ధ‌ర‌ణి ర‌ద్దు చేస్తా అని ప్ర‌క‌ట‌న‌లు చేస్తాడు. మా అధ్య‌క్షుడు అలా మాట్లాడ‌లేద‌ని శ్రీధ‌ర్ బాబు చెబుతున్నాడు. కాంగ్రెస్ నాయ‌కుల నోట్లో నుంచి ఒక్క పాజిటివ్ మాట కూడా రావ‌డం లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎక్క‌డా కాకుండా పోతుంది. ఇక‌నైనా వారి వైఖ‌రి మార్చుకోవాలి’ హితవు పలికారు. 

అదే విధంగా ధ‌ర‌ణి పోర్ట‌ల్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధ‌ర్ బాబు చేసిన ఆరోప‌ణ‌ల‌ను మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్‌తో రైతులు సంతోషంగా ఉన్నారని స్ప‌ష్టం చేశారు. గ‌త ఆరేళ్లలో 30 ల‌క్ష‌ల డాక్యుమెంట్లు రిజిస్ట్రేష‌న్ అయితే ఈ ఏడాదిన్న‌ర కాలంలోనే 23 ల‌క్ష‌ల 92 వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేష‌న్ అయ్యాయని తెలిపారు.  అన్నిస‌వ్యంగా జ‌రిగితే ఎవ‌రూ మాట్లాడ‌రని, ఎక్క‌డో ఒక చిన్న లోపం జ‌రిగితే భూత‌ద్దంలో పెట్టి చూపిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

ఒక‌ట్రెండు లోపాలు జ‌రిగితే రాష్ట్ర‌మంతా గంద‌ర‌గోళం నెల‌కొంద‌ని చెప్ప‌డం స‌రికాదని మంత్రి హితవు పలికారు. ఆధారాలు లేకుండా నిందారోప‌ణ‌లు చేయ‌డం స‌రికాదని, శాస‌న‌స‌భ‌ను, ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా మాట్లాడొద్ద‌ని కేటీఆర్ సూచించారు. ధ‌ర‌ణిని ర‌ద్దు చేయ‌డం.. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను బ‌ద్ద‌లు కొట్టడం, బాంబుల‌తో పేల్చేయాల‌న‌డం కాంగ్రెస్ విధానామా? అని కేటీఆర్ కాంగ్రెస్ స‌భ్యుల‌ను సూటిగా ప్ర‌శ్నించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)