Breaking News

నేను చెప్పింది తప్పయితే పరువు నష్టం దావా వేయండి: మంత్రి కేటీఆర్‌

Published on Tue, 04/11/2023 - 12:57

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలన్నదే తమ ఆలోచన అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం విక్రయిస్తోందని మండిపడ్డారు. ‘‘ప్రభుత్వ సంస్థలు బతికితేనే ప్రజలకు న్యాయం. బండి సంజయ్‌కు విషయ పరిజ్ఞానం లేదు.. ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఆయనకే తెలియదు’’ అని దుయ్యబట్టారు.

‘‘తెలుగు రాష్ట్రాల్లో స్టీల్‌ప్లాంట్‌ పెడతామని విభజన చట్టంలో ఉంది. బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో​ ప్రతిసారి ప్రశ్నిస్తున్నాం. సీఎం కేసీఆర్‌ పలుమార్లు కేంద్రానికి లేఖ రాశారు. ప్రధానిని స్వయంగా కలిసి బయ్యారం స్టీల్‌ప్లాంట్‌ గురించి మాట్లాడా. బయ్యారం స్టీల్‌ప్లాంట్‌పై కుట్రలు చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు గనులు, నిధులు. ఇవ్వకపోవడంతోనే నష్టాలు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను నష్టాల్లోకి నెట్టి అమ్మడానికి చూస్తున్నారు’’ అని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘విశాఖ పొట్ట కొడుతున్నది ప్రధాని మోదీనే. బయ్యారం విషయంలో కూడా అదే జరుగుతుంది. నేను చెప్పింది తప్పయితే పరువు నష్టం దావా వేయండి. తెలుగు రాష్ట్రాలకు విరుద్ధంగా బీజేపీ పనిచేస్తోంది’’ అని కేటీఆర్‌ విమర్శించారు.
చదవండి: ప్రతీకారం స్పష్టంగా కనిపిస్తోంది.. మంత్రి కేటీఆర్‌ సంచలన ట్వీట్‌

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)