Breaking News

కేటీఆర్, హరీష్ రావులది నా స్థాయి కాదు: కోమటిరెడ్డి

Published on Thu, 11/28/2024 - 16:00

సాక్షి, నల్గొండ జిల్లా: కేటీఆర్, హరీష్ రావులది తన స్థాయి కాదని.. వాళ్లు కేవలం కేసీఆర్ కుమారుడు, అల్లుడు మాత్రమేనంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల‌ వేసి నివాళులు  అర్పించిన మంత్రి.. అనంతరం మీడియాతో మాట్లాడారు.

‘‘బంగారు తెలంగాణ అంటూ అప్పులు చేసి కేసీఆర్ ఫాంహౌస్‌లో పడుకున్నాడు. తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలు అవుతున్నాయా?. ఇప్పటికే 18 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం. మిగతా రుణమాఫీ ఈ నెల 30న చేస్తాం’’ అని కోమటిరెడ్డి పేర్కొన్నారు.

మోదీ సొంత రాష్ట్రంలో పదమూడు వందలకు గ్యాస్ సిలిండర్ విక్రయిస్తున్నారు. తెలంగాణలో రూ.500కే సిలిండర్ ఇస్తున్నాం. రూ.500కే గ్యాస్ ఎందుకు ఇవ్వడం లేదో ప్రధాన మోదీ, బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి’’ అని కోమటిరెడ్డి డిమాండ్‌ చేశారు. తెలంగాణలో కేసీఆర్ అప్పులపాలు చేసి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తారిలా మార్చారు. ఒక ఇళ్లు కట్టకుండా కేసీఆర్‌ ఏడు లక్షల కోట్ల అప్పులు చేశాడు

కేసీఆర్ ఫామ్ హౌస్‌లో పడుకుంటే మోదీ విదేశాల్లో తిరుగుతున్నారు. డిసెంబరు మొదటి వారంలో సీఎం రేవంత్ నల్లగొండ జిల్లాలో పర్యటిస్తారు’’ అని కోమటిరెడ్డి తెలిపారు.

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)