Breaking News

‘స్కిల్‌’లో చంద్రబాబు దోపిడీ

Published on Mon, 09/18/2023 - 05:34

నెల్లూరు(దర్గామిట్ట): మాజీ సీఎం చంద్రబాబు తన నైపు­ణ్యాన్ని ప్రదర్శించి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో రూ.371 కోట్లు దోచుకున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. నెల్లూరులోని వైఎస్సార్‌­సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పవన్‌ కళ్యాణ్‌ నిర్మాతల వద్ద రెమ్యూ­న­రేషన్‌ తీసుకుని కెమెరాల ముందు మాట్లాడిన విధంగానే చంద్రబాబు దగ్గర ప్యాకేజ్‌ తీసుకుని ప్రజల ముందు మాట్లాడడం అలవాటు చేసుకున్నా­రని ఎద్దేవా చేశారు. అందుకే చంద్రబాబు, లోకేశ్‌ల­పై నమ్మకం లేక బాలకృష్ణను మధ్యవర్తిగా పెట్టు­కుని జైల్లో డీల్‌ కుదుర్చుకు­న్నారని మండిపడ్డారు.

కేంద్రంలోని నాయకుల కాళ్లమీద పడి తన తండ్రిని బయటకు తెచ్చుకునేందుకు లోకేశ్‌ ఢిల్లీలో గడప గడపకు తిరుగుతున్నా­డని అన్నారు. గతంలో అనేక కేసుల్లో చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌ చేసి, కోర్టులకు వెళ్లి సాంకేతిక కారణాలు చూపించి స్టేలు తెచ్చుకున్నారని విమర్శించారు. ప్రస్తుతం చంద్ర­బాబు అక్రమాలపై కోర్టు­లకు కూడా స్పష్టత వచ్చిందన్నారు. చంద్రబాబు బయ­టకు వచ్చే అవకా­శాలు ఉన్నాయా.. అని టీడీపీ శ్రేణులే అనుకుంటున్నా­యని, చివరకు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కూడా బాబు పనైపోయిందని మాట్లాడుతున్నారని చెప్పా­రు.

వీటన్నింటినీ పరి­శీలిస్తే చంద్రబాబు అవి­నీతికి పాల్పడ్డారని టీడీపీ క్యాడర్‌కు కూడా అర్థమైందని తెలుస్తోంద­న్నారు. తన భార్య ఆస్పత్రిలో ఉన్నారని రాజమ­హేంద్రవరం జైలు సూపరింటెండెంట్‌ సెలవు పెడితే పచ్చ మీడియా ప్రజలను రెచ్చ­గొట్టేలా అసత్య ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో మీ కుటుంబాల­కు మేలు జరి­గితేనే తమకు ఓటు వెయ్యాలని సీఎం జగన్‌ ధైర్యంగా చెబుతున్నారని, కానీ చంద్ర­బాబు మాత్రం ఎవరో ఒకరితో పొత్తులు పెట్టు­కుని ప్రజ­లను బలి చేయాలని చూస్తున్నారని విమర్శించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)