Breaking News

‘బాబు మోసాన్ని వివరిస్తాం.. జగన్‌ మంచిని గుర్తు చేస్తాం’

Published on Wed, 11/08/2023 - 20:38

సాక్షి, నెల్లూరు జిల్లా: రేపటి(గురువారం) నుంచి ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన నెల్లూరు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయనతో పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్ది, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్ది, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్ది పాల్గొన్నారు.

చంద్రబాబు చిన్నాభిన్నం చేసిన వ్యవస్థను సీఎం జగన్ గాడిలో పెట్టారని, అధికారంలోకి రాగానే నాలుగు లక్షల 93 వేల మందికి ఉద్యోగాలు అందించామని మంత్రి తెలిపారు. వ్యవసాయ వృద్ధిలో దేశంలోనే ఆరో స్థానానికి ఏపీ చేరుకుందన్నారు. పాఠశాలల అభివృద్ధి కోసం నాడు-నేడు ద్వారా 11 వే 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ‘నాలుగేళ్లలో నాలుగు ఓడరేవులు, 10 ఫిషింగ్ హార్బర్లను నిర్మించామని మంత్రి కాకాణి అన్నారు.

‘‘మేనిఫెస్టోను మాయం చేసి ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య. ప్రజలకు చేసిన మంచిని వారికి తెలియజేసేందుకు ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.డీబీటీ ద్వారా ప్రజలకు అందిన సాయాన్ని ప్రజలకు వివరిస్తాం. పూర్తిగా పార్టీ కార్యక్రమం కావడంతో క్యాడర్ పెద్ద ఎత్తున పాల్గొంటుంది. టీడీపీ చేసిన మోసాన్ని ప్రజలకు వివరించి.. జగన్ చేసిన మంచిని గుర్తు చేస్తాం. వైఎస్సార్‌సీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెంట నడిచిన పార్టీ నేతల ఇంటికి వెళ్లి.. వారిని పరామర్శిస్తాం. మాది రైతు ప్రభుత్వం..రైతులకు అండగా ఉంటాం.. 2024లో వైఎస్సార్‌సీపీ మళ్లీ అధికారంలోకి రావడం కోసం అందరూ గట్టిగా పని చేయాలని మంత్రి కాకాణి పిలుపునిచ్చారు.
చదవండి: సొంత జిల్లాకు సీఎం జగన్‌.. రెండు రోజుల పర్యటన

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)