Breaking News

సిక్కుల విషయంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..

Published on Tue, 09/10/2024 - 17:29

వాషింగ్ట‌న్‌: అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న రాహుల్ గాంధీ.. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్‌(ఆర్ఎస్ఎస్)ను టార్గెట్‌ చూస్తూ త‌న‌దైన రీతిలో విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే డల్లాస్‌లో విమర్శలు గుప్పించిన రాహుల్‌. తాజాగా వర్జినాలోనూ అదే తరహాలో మాట్లాడారు. కొన్ని రాష్ట్రాలు, మ‌తాలు, భాష‌లు, వ‌ర్గ ప్ర‌జ‌ల‌ను.. ఆర్ఎస్ఎస్ తక్కువ అన్న అభిప్రాయంతో చూస్తున్న‌ట్లు ఆయ‌న ఆరోపించారు. 

అలాగే భారత్‌లో సిక్కు మతస్థుడు తలపాగాను పెట్టుకునే అవకాశాన్ని కల్పిస్తారో లేదో, సిక్కులను గురుద్వారా వెళ్లనిస్తారో లేదో అంటూ వ్యాఖ్యానించారు. భార‌త్‌లో జ‌రుగుతున్న పోరాటం ఇదే అని, రాజ‌కీయ పోరాటం కాదు అని ఆయ‌న తెలిపారు. అయితే యూఎస్‌లో రాహుల్‌ చేస్తున్న వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. 

ఈ మేరకు కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి మాట్లాడుతూ.. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్‌ గాంధీ.. విదేశాల వేదికగా ప్రవాసుల భారతీయుల మధ్య దేశంపై ప్రమాదకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. రాహుల్ భారత్‌కు తిరిగి వచ్చి ఈ వ్యాఖ్యలు చేయగలరా? అంటూ ప్రశ్నించారు.

‘రాహుల్‌ వ్యాఖ్యలు దుర్మార్గం. అతని ముందు ఉన్న వారు నా కమ్యూనిటీకి చెందినవారు. వారు యూఎస్‌లో జీవిస్తున్నారు. దేశంతో బలమైన సంబంధం లేదు. అలాంటి వారికి రాహుల్‌ తప్పుడు విషయాలు ప్రచారం చేస్తున్నారు. తన అమెరికా పర్యటనలో భారత న్యాయ వ్యవస్థపై, ఎన్నికల ఫలితాలపై, కాంగ్రెస్‌ ఖాతాల స్తంభణపై మాట్లాడుతున్నారు. కానీ గత దశాబ్ద కాలంలో భారత్‌లో జరిగిన అభివృద్ధి గురించి ప్రాస్తావించడం విస్మరించారు.

నేను ఆరు దశాబ్దాలుగా ఓ సిక్కుగా టర్బన్ (తలపాగా) ధరిస్తున్నాను. కడెం కూడా వేసుకుంటున్నాను. దీన్ని ధరించడంలో ఎప్పుడూ సమస్య రాలేదు. అసలు రాహుల్ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడే సిక్కులు భయాందోళనతో జీవించారు. ఇందిరా గాంధీ హత్య తర్వాత1984లో సిక్కులపై హత్యాకాండ జరిగింది. మూడు వేల మంది అమాయక ప్రజలను చంపారు. వారిని ఇళ్ల నుంచి బయటకు లాగి సజీవ దహనం చేశారు. కానీ ఇప్పుడు బీజేపీ హయాంలో సిక్కు సమాజం చాలా సురక్షితంగా, గౌరవంగా జీవిస్తోందన్నారు. తమ ప్రభుత్వం సిక్కుల సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు వచ్చింది’ అని తెలిపారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)