Breaking News

కాంగ్రెస్‌ అంటేనే కూల్చివేతలు.. బీజేపీ ఉద్యమమే: బండి సంజయ్‌

Published on Fri, 02/27/2026 - 13:05

సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్‌ నేతలకు రైతుభరోసా గుర్తుకు వస్తుందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అంటేనే కూల్చివేతలు అంటూ హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటే... ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.

కరీంనగర్‌లో కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ..‘రైతులకు రైతు భరోసా ఇస్తానన్న మాటను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మర్చిపోయారు. ముఖ్యమంత్రి నోటి నుండి వచ్చే మాటలు శాసనంలా ‌ఉండాలి. బీఆర్ఎస్ ఏ విధంగా విమర్శలు, గూడు పుటానీలు చేసారో.. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి కూడా అదే చేస్తున్నారు. రైతు భరోసా మొదటి విడత డబ్బులు ఎగ్గొట్టారు. ఎన్నికలు వచ్చినప్పుడే రైతు భరోసా గుర్తుకు వస్తుందా?. రైతు భరోసా ఇవ్వకపోతే రైతులే వాతలు పెడుతారు. కేబినెట్ మీటింగ్‌లో రైతు భరోసా గురించి ఎందుకు చర్చించలేదు. మూడు విడతలు కలిపి 27000 కోట్లు ఇవ్వాల్సిందే. రాష్ట్ర  ముఖ్యమంత్రికి కూడా రైతు భరోసా ఇవ్వాలని ఉత్తరం రాశాను. రైతు భరోసా ఇవ్వకుంటే బీజేపీ ఆధ్వర్యంలో  పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదు’ అని హెచ్చరించారు.

అలాగే, ఖమ్మంలో కూల్చివేతల ఘటనపై స్పందిస్తూ..‘కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కూల్చివేతలు. కూల్చడానికి గల కారణాలు ఏంటి?. మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కలిసి అ స్థలాన్ని ఆక్రమించుకోవాలని చుస్తున్నారు. హైడ్రా.. కూల్చివేతలతో ఆగమాగం చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం ఇండ్లు కట్టడానికి పోటీ పడుతుంటే.. ఈ ప్రభుత్వం కూల్చివేయడానికి పోటీ పడుతుంది. ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కడా లేరు అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు.

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ..‘కాంగ్రెస్, ఎంఐఎంలు ఒక్కటే.. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఈరోజు 80% ముస్లిం మహిళలు బీజేపీకి ఓటేసే పరిస్థితి వచ్చింది. నిన్నటి దాక దోస్తీగా ఉన్నా కాంగ్రెస్, ఎంఐఎంలకు ఎక్కడ చెడిందో తెలియదు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో కవిత వ్యవహారంపై ప్రశ్నించగా.. తెలుసుకుని మాట్లాడతాను అని వ్యాఖ్యలు చేశారు. 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)