Breaking News

ఎన్నికల కోడ్‌ సాకుతో రైతు భరోసా ఆపొద్దు: బండి సంజయ్‌

Published on Fri, 01/31/2025 - 13:19

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికల కోడ్‌ సాకుతో రైతు భరోసా డబ్బులు నిలిపి వేయవద్దని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సూచించారు కేంద్రమంత్రి బండి సంజయ్‌. ఇది కొనసాగుతున్న పథకమే.. ఎన్నికల పేరుతో రైతుల పొట్టకొట్టకండి అని వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో అర్హులందరికీ రేషన్‌కార్డులు ఇవ్వాల్సిందేనని చెప్పుకొచ్చారు.

కేంద్రమంత్రి బండి సంజయ్‌ తాజాగా ఓ ప్రకటనలో.. ‘రైతు భరోసా డబ్బులు వేయండి. ఇది కొనసాగుతున్న పథకమే. ఎన్నికల కోడ్ సాకుతో రైతుల పొట్టకొట్టకండి. ఎన్నికలు గ్రాడ్యుయేట్లు, టీచర్లకే పరిమితం. రైతు భరోసాతో ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశమే లేదు. ఇప్పటికే ఏడాది రైతు భరోసా సొమ్ము ఎగొట్టారు. అసలే అన్నదాతలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో వేయాల్సిందే. రేషన్ కార్డులు అర్హులందరికీ ఇవ్వాల్సిందే.

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. రైతు కూలీల అకౌంట్స్‌లో వేయాల్సిందే. ఎన్నికల కోడ్ సాకుతో ఆపితే ఊరుకునేది లేదు. ప్రభుత్వ చేతకానితనాన్ని ఎన్నికల కోడ్ పేరుతో ముడి పెట్టకండి. ఇండ్ల లబ్ధిదారుల ఎంపికను కొనసాగించండి. అవసరమైతే బీజేపీ పక్షాన ఎన్నికల సంఘానికి లేఖ పంపిస్తాం. తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించండి. అవసరమైతే అందరం కలిసి ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేద్దాం’ అని కామెంట్స్‌ చేశారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)