Breaking News

హరీష్‌ ఫోనే వాడలేదు.. విచారణ ఏంటి?: బండి సంజయ్‌

Published on Tue, 01/20/2026 - 20:43

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో ఇంకెన్నాళ్లీ డ్రామాలు? అంటూ ప్రశ్నించారు. కర్ర విరగదు.. పాము చావదన్నట్లుగా ఫోన్ ట్యాపింగ్ కేసు సాగుతోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులను వెంటనే అరెస్ట్ చేయాలి అని సవాల్‌ విసిరారు.

కేంద్రమంత్రి బండి సంజయ్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఢిల్లీకి, ఫాంహౌస్‌కు మధ్య ఇంకా డీల్ కుదరలేదా?. ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులైన తండ్రీ కొడుకులను ఎందుకు విచారించడం లేదు?. దీనికి కారకులైన ఒక్క నాయకుడినైనా అరెస్ట్ చేశారా?. తన ఫోన్ కూడా ట్యాప్ చేశారంటూ హరీష్ రావు గతంలో చెప్పారు కదా?. చాలా రోజులు హరీష్ రావు ఫోన్ కూడా మాట్లాడని విషయం మీకు తెలియదా?. కర్ర విరగదు.. పాము చావదన్నట్లుగా సాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు. రెండేళ్లుగా సాగుతున్న విచారణలో కొండను తవ్వి కనీసం ఎలుకను కూడా పట్టలేకపోయారు.

కేసీఆర్ సర్కార్ మాదిరిగానే ప్రజా సమస్యల నుండి దృష్టి మళ్లించేందుకు ఫోన్ ట్యాపింగ్ కేసును వాడుకుంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ తీరును చూస్తుంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల దాకా ఫోన్ ట్యాపింగ్ కేసును సాగదీసేలా ఉన్నారు. విచారణ పేరుతో సిట్ సాగదీస్తున్న విచారణను చూసి జనం నవ్వుకుంటున్నారు. నిజంగా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి దమ్ముంటే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సూత్రధారులను వెంటనే అరెస్ట్ చేయాలి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)