Breaking News

టీడీపీ అరాచకం.. సిట్‌ బృందాన్ని కలిసిన మంత్రి అంబటి

Published on Sun, 05/19/2024 - 15:53

సాక్షి, పల్నాడు: సిట్‌ బృందాన్ని మంత్రి అంబటి రాంబాబు కలిశారు. సిట్‌ బృందానికి కొన్ని విషయాలు నివేదించారు. సత్తెనపల్లి నుంచి తాను మూడుసార్లు ఎన్నికల్లో పోటీ చేశానని.. ఎన్నికల్లో ఇప్పుడు జరిగినంత హింస ఎప్పుడు జరగలేదని మంత్రి అంబటి అన్నారు. పోలీసులు టీడీపీ నాయకులతో కుమ్మక్కయ్యారని.. దాడులు అదుపు చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు.

ఎన్నికల రోజు టీడీపీ నాయకులు చేసిన అరాచకాన్ని సిట్ బృందానికి మంత్రి అంబటి రాంబాబు వివరించారు. ఇప్పటికీ తొండపి గ్రామంలో చాలా మంది భయంతో ఊరు వదిలి పెట్టి వెళ్లిపోయారని.. వారికి భరోసా కల్పించి ఊరిలోకి తీసుకురావాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని అంబటి అన్నారు. తాజాగా పోలీసులు నమోదు చేస్తున్న అక్రమ కేసులపైన కూడా సిట్ బృందానికి మంత్రి వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

‘‘పల్నాడు, తాడిపత్రిలో హింస చెలరేగింది. అధికారులను మార్చినచోటే హింస చెలరేగింది. ఈవీఎంలను పగలగొట్టాలనే ఉద్దేశంతో దాడులు చేశారు. ఎక్కడైతే పురేందేశ్వరి ఫిర్యాదుతో అధికారులను మార్చారో అక్కడే హింస జరిగింది. చంద్రబాబు, పవన్‌, పురేందేశ్వరి కుట్రలు చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల కమిషన్‌ నియమించిన అధికారులను సస్పెండ్‌ చేశారు. అధికారం రాదనుకున్నప్పుడే చంద్రబాబు హింసను ప్రేరేపిస్తాడు’’ అంటూ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.

‘‘పల్నాడు, తాడిపత్రిలో దాడులకు కారణం బాబు, పురందేశ్వరియే. కన్నా లక్ష్మీ నారాయణ దగ్గర కొందరు అధికారులు డబ్బులు తీసుకున్నారు. సిట్‌ అధికారులు అన్ని విషయాలు తెలుసుకుంటారని భావిస్తున్నాను. సిట్‌ అధికారులకు నాకు తెలిసిన సమాచారం ఇచ్చా’’ అని అంబటి రాంబాబు చెప్పారు.
 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)