Breaking News

పుంగనూరు విధ్వంసానికి చంద్రబాబే కారణం: మంత్రి అంబటి

Published on Sat, 08/05/2023 - 12:30

సాక్షి, అమరావతి: పుంగనూరు విధ్వంసానికి చంద్రబాబే కారణమని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. సత్తెనపల్లి వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయం నుంచి మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక రాయలసీమకు ద్రోహం చేశారనే దుష్ప్రచారం చేసేందుకు చంద్రబాబు పుంగనూరుకి వెళ్ళారని తెలిపారు. ఆ ప్రాంతంలో హింసను ప్రోత్సహించి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో పుంగనూరు, తంబళ్లపల్లె, మదనపల్లి, పీలేరు ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రారంభించిందని.. భారీ నీటి ప్రాజెక్టులతో పాటు పలు చిన్న-చిన్న డ్యామ్లను కూడా కడుతున్నామని అన్నారు. ఈ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు చంద్రబాబు గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్లి స్టే తెచ్చారు.. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న అక్కడి ప్రజలు ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించారని చెప్పారు.

పోలీసులు కూడా పుంగనూరు రావొద్దని చెప్తే మొదట చంద్రబాబు అంగీకరించారని, పుంగనూరు ఊరిలోకి కాకుండా బైపాస్లో వెళ్లేందుకు ఒప్పుకున్నారని అన్నారు. చివరిలో పుంగనూరు వెళ్తానని బాబు పట్టుబట్టడంతో తప్పని పరిస్థితుల్లో పోలీసులు అడ్డుకున్నారని వెల్లడించారు. దీంతో అడ్డుకున్న పోలీసులపై రాళ్ళు, బీరు బాటిల్స్ తో దాడి చేయించారని మండిపడ్డారు.

చదవండి: టీడీపీ విధ్వంసాన్ని నిరసిస్తూ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బంద్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)