Breaking News

బీహార్‌లో ప్లాన్‌ మార్చిన ఎంఐఎం ఒవైసీ.. బీజేపీ ఓటమే టార్గెట్‌గా..

Published on Sun, 06/29/2025 - 11:37

పాట్నా: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మరోసారి ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చేందుకు ప్లాన్‌ చేస్తుండగా.. ప్రతిపక్ష కూటమి ఎత్తులకు పైఎత్తులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఎంఐఎం అధినేత ఒవైసీ, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే కూటమి ఓడించడమే తమ ముందున్న లక్ష్యమని ఒవైసీ చెప్పుకొచ్చారు.

ఎంపీ, ఎంఐఎం అధినేత ఒవైసీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రాకుండా నిరోధించేందుకు ప్రతిపక్ష మహాఘటబంధన్‌తో ఎంఐఎం కలిసి పనిచేయాలని నిర్ణయించింది. మహాఘటబంధన్ నాయకులతో సంప్రదింపులు జరిగాయి. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. మా పార్టీ బీహార్‌ చీఫ్ అఖ్తరుల్ ఇమాన్, కాంగ్రెస్, ఆర్జేడీ, ఇతరులతో కూడిన మహాఘటబంధన్ నాయకులను సంప్రదించారు. బీహార్‌లో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావాలని మేం కోరుకోవడం లేదు.

ఇప్పుడు బీహార్‌లో ఎన్డీఏ తిరిగి అధికారంలోకి రావాలా? వద్దా? అనేది ఈ రాజకీయ పార్టీలపైనే ఆధారపడి ఉంది. బీహార్‌లోని సీమాంచల్ ప్రాంతంలో ఎంఐఎం బలమైన ఉనికిని కలిగి ఉంది. గత ఎన్నికల్లో ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. తర్వాత వారిలో నలుగురు ఆర్జేడీలో చేరడంతో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మా పార్టీ సీమాంచల్ నుంచే కాకుండా బయట కూడా అభ్యర్థులను నిలబెడుతుంది.  ఒకవేళ వారు (మహాఘట్‌బంధన్) తమతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా లేకుంటే.. ప్రతీ స్థానంలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అని చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో ఓటర్ల జాబితాపై ఒవైసీ సంచలన ఆరోపణలు చేశారు. ఓటర్ల జాబితాలో “స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్”ను వ్యతిరేకిస్తూ ఒవైసీ భారత ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ సందర్భంగా ఒవైసీ..‘ఇది చట్టబద్ధంగా ప్రశ్నార్థకమైన చర్య. ఇది రాబోయే ఎన్నికలలో నిజమైన ఓటర్లకు స్వరం లేకుండా చేస్తుంది. ఓటరు జాబితాలో నమోదు కావడానికి, ప్రతి పౌరుడు ఇప్పుడు వారు ఎప్పుడు, ఎక్కడ జన్మించారో నిరూపించే పత్రాలను మాత్రమే కాకుండా, వారి తల్లిదండ్రులు ఎప్పుడు, ఎక్కడ జన్మించారో కూడా చూపించాల్సి ఉంటుంది. దీంతో, ఓటర్లకు తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంది. ఇది వారి రాజ్యాంగ హక్కులను కాలరాస్తుంది’ అని తెలిపారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)