Breaking News

‘చంద్రబాబు కన్నా డ్రామా చేసేవారే నయం’

Published on Sat, 08/03/2024 - 11:30

సాక్షి, రాజమండ్రి: వరద బాధితులను ఆదుకోవటంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ నేత మార్గాని భరత్‌ మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.

‘వరద బాధితులకు ప్రభుత్వం నిత్యవసరాలు పంపిణీ చేయటం లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు వరద ప్రభావిత  ప్రాంతాల్లో పర్యటించడం​ లేదు. వరద ప్రాంతాల్లో కేవలం ఫొటోలు దిగి ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నారు. వరద సహాయక చర్యలు చేపట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గతంలో వైఎస్సార్‌సీపీ హయాంలో పరిహారం, రేషన్, అందించడంలో ముందుంది. ఇంతవరకు ఏరియల్ సర్వే కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో జరగలేదు. బ్రిడ్జిలంక దగ్గర ఉన్న వరద బాధితులను రాజమండ్రి తీసుకొచ్చి షో చేశారు. ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలి. నీటి మునిగిన జాతీయ రహదారులను వెంటనే పునరుద్ధరించి, రాకపోకలకు అంతరాయం లేకుండా చేయాలి. లైఫ్ జాకెట్ లేకుండా వరద నీటిలో పడి చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. 

.. వాలంటీర్లకు పదివేల రూపాయలు స్టైఫండ్ ఇస్తానని చెప్పి వ్యవస్థనే నిర్మూలించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నిరుద్యోగ భృతి ఊసేత్తడం లేదు. సూపర్ సిక్స్ హామీలు ఎత్తెస్తాడేమో అనిపిస్తుంది. తల్లికి వందనం పథకానికి మంగళంపాడే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు కన్నా డ్రామాలాడే వాడే నయం. ప్రజలను దారుణంగా వంచిస్తున్నారు. సంపద సృష్టిస్తామన్నారు.. ఇప్పటివరకు ఏమి సృష్టించలేకపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా తల్లికి వందనం కోసం ఎదురుచూస్తున్నారు. రైతు భరోసా ఎక్కడుంది. సహాయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. 

.. ఇసుక కొండలు ఏమైపోయాయి. ఇసుక గుట్టలను స్థానిక ఎమ్మెల్యేలు మింగేశారు. నాలుగు రోజుల్లోనే బకాసురుల్ల మింగేశారు. స్థానిక ఎమ్మెల్యే నాలుగు రోజుల్లోనే రూ. 10 కోట్లఇసుక మింగేశారు. ఉచిత ఇసుక ఎవరికిచ్చారు? రాజమండ్రి వ్యాప్తంగా సెటిల్‌మెంట్‌ బ్యాచ్‌లే నడిపిస్తున్నాయి. పేకాట క్లబ్ నడుపుకుంటామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. వాళ్లే దగ్గరుండి నడిపిస్తున్నారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం. పేకాట క్లబ్బుల్లో ఎమ్మెల్యే వాటా ఎంతో చెప్పాలి? జిల్లా పోలీసు అధికారులను పేకాట డబ్బులు నడుపుకుంటామని ఎమ్మెల్యేలే అడుగుతున్నారు. ఇదెక్కడి ప్రభుత్వం. గతంలో వేలకోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇసుక వల్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఉచిత ఇసుక పేరుతో ఎమ్మెల్యేలు దోచేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రతి వ్యాపారి వద్దకు వెళ్లి కమిషన్‌ కట్టమని ఒత్తిడి తీసుకొస్తున్నారు’అని భరత్‌ అన్నారు. 


 

Videos

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)