Breaking News

ఎంత ధైర్యం?.. పుతిన్‌ ముందే అలా చేస్తావా?

Published on Sat, 12/20/2025 - 08:19

ప్రపంచంలో శక్తివంతమైన నేతల్లో వ్లాదిమిర్‌ పుతిన్‌ ఒకరు. ఆయన అలవాట్లు.. మేనరిజం.. ప్రోటోకాల్‌.. అన్నీ ఎంతో ప్రత్యేకంగానే ఉంటాయి. అలాంటిది ఆయన సమక్షంలో ఓ యువకుడు.. తన ప్రియురాలికి ప్రపోజ్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. మరి ఆ ప్రపోజల్‌కు ఆ యువతి ఏం చేసింది.. దానికి పుతిన్‌ రియాక్షన్‌ ఎలా ఉందో తెలుసుకోవాలని ఉందా?.. 

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ 2025 ఏడాది ముగింపు నేపథ్యంతో.. విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రిపోర్టర్‌లు పలు ప్రశ్నలు అడగ్గా.. దానికి పుతిన్‌ బదులిస్తూ వచ్చారు. ఈ క్రమంలో కిరిల్‌ బజానోవ్‌ అనే 23 ఏళ్ల యువ జర్నలిస్టు వంతు వచ్చింది. ‘నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’ అని ప్లకార్డును పట్టుకున్న అతను.. పుతిన్‌ ముందే తన ప్రియురాలికి ప్రపోజ్‌ చేశాడు. ‘నా స్నేహితురాలు దీన్ని చూస్తోంది. ఓల్గా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?. ప్లీజ్‌ నన్ను పెళ్లి చేసుకో.. నేను నీకు ప్రపోజ్‌ చేస్తున్నా’ అని అన్నాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వులు చిందించారు.  వెంటనే ఆ ప్రాంగణంలోని వారంతా చప్పట్లు కొట్టారు. 

అనంతరం అతడు.. రష్యాలో జీవన వ్యయం పెరగడంపై ఆందోళన వ్యక్తంచేశాడు. తాను, తన స్నేహితురాలు ఎనిమిదేళ్లుగా కలిసి ఉంటున్నామని అయితే, విస్తృత ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా పెళ్లి చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు పుతిన్‌ దృష్టికి తీసుకెళ్లాడు. ఇక, సమావేశం కొనసాగుతుండగా.. ప్రోగ్రామ్‌ హోస్ట్‌ కీలక ప్రకటన చేశారు. జర్నలిస్టు కిరిల్‌ బజానోవ్‌ ప్రపోజల్‌ను అతడి స్నేహితురాలు అంగీకరించినట్లు తెలిపారు. దీంతో పుతిన్‌తో సహా అక్కడున్న వారంతా ఆనందం వ్యక్తంచేస్తూ చప్పట్లు కొట్టారు. 

అయితే కిరిల్‌ లాంటి యువ కుటుంబాల ఆర్థిక పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన పుతిన్‌.. విరాళాల రూపంలో అయినా ఇలాంటి పెళ్లిళ్లకు సాయం అందించాలని పిలుపు ఇచ్చారు. ఈ సమయంలో తమ పెళ్లికి రావాలంటూ కిరిల్‌ రష్యా అధినేతను ఆహ్వానించగా.. ఆయన నుంచి ఎలాంటి బదులు రాలేదు.  ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. 

Videos

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)