Breaking News

బెంగాల్ ఎన్నికలు: షాకిస్తున్న లేటెస్ట్ సర్వే రిపోర్ట్!

Published on Sat, 03/14/2026 - 09:09

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతోంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న తరుణంలో బెంగాల్ ప్రజల మనోగతం ఎలా ఉందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా వెలువడిన ‘ఓట్ వైబ్’ (Vote Vibe) సర్వే ఫలితాలు ఎంతో ఆసక్తి కలిగిస్తున్నాయి. ముఖ్యమంత్రి పీఠంపై మమతా బెనర్జీ పట్టు ఏ మేరకు ఉన్నదనేది ఈ సర్వే తేల్చిచెప్పింది.

దీదీకే జై కొడుతున్న జనం!
తాజా సర్వే వివరాల ప్రకారం బెంగాల్ ముఖ్యమంత్రిగా 42 శాతం మంది మమతా బెనర్జీ వైపే మొగ్గు చూపారు. ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారికి కేవలం 19 శాతం మంది మాత్రమే మద్దతు పలికారు. ఐప్యాక్ (ఐ-పాక్‌)సంస్థపై ఈడీ దాడులు జరిగినప్పటికీ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పర్సెప్షన్ యుద్ధంలో గెలిచిందని, ముఖ్యంగా ముస్లిం ఓటర్ల మద్దతును పదిలపరుచుకుందని సర్వే పేర్కొంది.

ప్రభుత్వ పనితీరుపై మిశ్రమ స్పందన
మమత ప్రభుత్వ పనితీరుపై జనం భిన్నంగా స్పందిస్తున్నారు. సుమారు 34 శాతం మంది ‘అద్భుతం’ అని కితాబివ్వగా, 18 శాతం మంది మాత్రం ‘చాలా దారుణం’ అంటూ పెదవి విరిచారు. సర్వేలో అధికార పార్టీకి కొన్ని హెచ్చరికలు కూడా వెలువడ్డాయి. దాదాపు 36 శాతం మంది ఓటర్లు నిరుద్యోగాన్ని ప్రధాన సమస్యగా భావిస్తున్నారు. మరోవైపు టీఎంసీ.. అక్రమ వలసలను ప్రోత్సహిస్తోందన్న బీజేపీ ప్రచారాన్ని 47 శాతం మంది నమ్ముతుండటం గమనార్హం. ఎస్సీ, ఎస్టీ, యువ ఓటర్లు టీఎంసీకి దూరమయ్యే అవకాశం ఉందని సర్వే హెచ్చరించింది.

ఎన్నికల నగారాకు అంతా సిద్ధం
వచ్చే వారం రోజుల్లో పశ్చిమ బెంగాల్‌తో పాటు కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్ ఇప్పటికే 294 నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులను నియమించింది. ప్రధాని మోదీ అస్సాం పర్యటన ముగిసిన వెంటనే  ఎన్నికల తేదీలు ప్రకటించే అవకాశం ఉన్నదని సమాచారం. 2021లో భారీ మెజారిటీతో గెలిచిన దీదీ, ఈసారి నాలుగోసారి అధికారాన్ని దక్కించుకుంటారా? లేక బెంగాల్ కోటను బీజేపీ బద్దలు కొడుతుందా? అనేది వేచి చూడాలి.

ఇది కూడా చదవండి: శబరిమల వివాదం.. కేరళ సర్కార్ ‘యూ టర్న్’

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)