Breaking News

బంగ్లా దేశీయులకు ఆశ్రయం ఇస్తాం: సీఎం మమత

Published on Sun, 07/21/2024 - 16:54

కోల్‌కతా: బంగ్లాదేశ్ నుంచి వచ్చే శరణార్థులుకు తమ రాష్ట్రం ఆశ్రయం కల్పిస్తుందని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఆదివారం అధికార టీఎంసీ నిర్వహించిన అమరవీరుల దినోత్సవ ర్యాలీలో సీఎం మమత పాల్గొని మాట్లాడారు.

‘‘ బంగ్లాదేశ్‌ పొరుగున ఉన్న దేశం.. కావున ఆ దేశం గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేను. బంగ్లాదేశ్‌ గురించి భారత ప్రభుత్వం మాట్లాడాలి. అయితే నిస్సహాయులైన ప్రజలు (బంగ్లాదేశ్‌కు చెందినవారు) బెంగాల్‌ తలుపు తడితే మాత్రం.. తాము కచ్చింతంగా ఆ ప్రజలకు ఆశ్రయం కల్పిస్తాం. 

ఐక్యరాజ్య సమితిలోనే దీనిపై నిర్మానం చేయబడి ఉంది. శరణార్థులును పొరుగుదేశం వాళ్లు గౌరవించాలని అందులో ఉంది. బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో ఇబ్బంది పడుతున్న బెంగాల్ ప్రజల బంధువులకు తాము పూర్తి సహకారం అందిస్తాం’ అని సీఎం మమత తెలిపారు.

 

ఈ ర్యాలీలో పాల్గొన్న సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ లోక్‌సభ ఎన్నికల ప్రదర్శనపై సీఎం మమత ప్రశంసలు కురిపించారు.

‘‘ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఎక్కువ కాలం అధికారంలో ఉండలేదు.  ఇది స్థిరమైన ప్రభుత్వం కాదు.. త్వరలోనే కూలిపోయింది.  మీరు (అఖిలేష్‌) ఇచ్చిన లోక్‌ససభ ఎన్నికల ప్రదర్శనకు యూపీలో బీజేపీ ప్రభుత్వం రాజీనామా చేయాలి. కానీ, సిగ్గులేని బీజేపీ ప్రభుత్వం.. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ఇంకా అధికారంలోనే కొనసాగుతోంది’’ అని బీజేపీపై విమర్శలు గుప్పించారామె.

అనంరతం ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ మాట్లాడారు. ‘‘ప్రశ్చిమ బెంగాల్‌ ప్రజల వలే యూపీ ప్రజలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఢిల్లీలో అధికారంలో కూర్చున్నవారి అధికారం కొన్నిరోజుల మాత్రమే ఉంటుంది. కేంద్రంలోని ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది’’ అని అన్నారు. 

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వ అనుకూల విద్యార్థి సంఘాలకు చెందిన విద్యార్థులు, రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న ఆందోళనకారుల మధ్య జరిగిన హింసలో ఇప్పటివరకు 151 మంది ప్రాణాలు కోల్పోయారు.  బంగ్లాదేశ్‌లో సంక్షోభం నెలకొన్న ఈ సమయంలో  బెంగాల్ సీఎం మమత చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)