Breaking News

‘వారిపై చర్యలు తీసుకోండి’.. ప్రధాని మోదీకి ఖర్గే లేఖ

Published on Tue, 09/17/2024 - 16:23

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. లోక్‌సభలో ప్రతిపక్షనేత, ఎంపీ రాహుల్‌ గాంధీపై బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాహుల్‌పై అభ్యంతరకరమైన, హింసాత్మక ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరారు.

బీజేపీ, తమ అనుబంధ పార్టీల నేతలు ఉపయోగించే అసభ్యకరమైన భాష భవిష్యత్తు తరాలకు ప్రమాదకరమని ఖర్గే తెలిపారు. ఇది ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి సంబంధించిన సమస్యగా పేర్కొన్నారు. ‘బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక మంత్రి, రాహుల్‌ను ‘నంబర్ వన్ టెర్రరిస్ట్’గా పలిచారు.  మహారాష్ట్రలోని మీ ప్రభుత్వంలోని ఓకూటమి పార్టీకి చెందిన ఎమ్మెల్యే(శివసేన ఎమ్మెల్యే సంజయ్‌ గైక్వాడ్‌) రాహుల్‌​ నాలుక కోస్తే వారికి రూ.11 రివార్డును ప్రకటిస్తున్నారు. ఢిల్లీలోని ఓ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే  రాహుల్‌పై దాడి చేస్తామని బహరంగంగా బెదిరిస్తున్నారు.
చదవండి:అతిషీ మర్లీనా ‘డమ్మీ సీఎం’: స్వాతి మాలీవాల్

భారత సంస్కృతి అహింస, సామరస్యం, ప్రేమకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మన లీడర్లు రాజకీయాల్లో ఈ పాయింట్లను ప్రమాణాలుగా స్థాపించారు. బ్రిటీష్ పాలనలోనే గాంధీజీ ఈ ప్రమాణాలను రాజకీయాల్లో ముఖ్యమైన భాగంగా చేశారు. స్వాతంత్య్రానంతరం పార్లమెంటరీ రంగంలో అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య గౌరవప్రదమైన ఒప్పందాలు కుదిరిన చరిత్ర ఉంది. ఇది భారత ప్రజాస్వామ్య ప్రతిష్టను పెంచడానికి పనిచేసింది.

ఈ విషయంపై కోట్లాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి విద్వేషపూరిత శక్తుల వల్ల జాతిపిత మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు తమ ప్రాణాలను త్యాగం చేయాల్సి వచ్చింది. అధికార పార్టీ ఈ రాజకీయ ప్రవర్తన ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత దారుణమైన ఉదాహరణ. మీ నేతలు వెంటనే హింసాత్మక ప్రకటనలు చేయడం మానేయాలి. ఇందుకు మీరు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను’ అని లేఖలో పేర్కొన్నారు

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)