Breaking News

బీజేపీ మేనిఫెస్టోపై మల్లికార్జున ఖర్గే విమర్శలు

Published on Sun, 04/14/2024 - 15:36

ఢిల్లీ: లోక్‌ సభ ఎ‍న్నికల వేళ బీజేపీ విడుదలచేసిన మేనిఫెస్టోపై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. గత పదేళ్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేదల కోస చేసిందేమీ లేదని విమర్శించారు. గత ఎ‍న్నికల సందర్భంగా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. ఆ హామీని కూడా నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. మరోవైపు.. పంటల మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ.. దేశవ్యాప్తంగా రైతులు రోడ్డు ఎక్కి ధర్నా చేశారని విషయాన్ని ఖర్గే గుర్తుచేశారు.

‘యువతకు ఉద్యోగాల కల్పన కోసం ఎదురు చూస్తోంది. మరోవైపు ద్రవ్యోల్బణం పెరుగుతోంది. అయినా ఈ సమస్యలు మాత్రం ప్రధాని మోదీకి పట్టడం లేదు. మోదీ ప్రధానిగా కొనసాగిన ఈపదేళ్ల కాలంలో దేశంలోని ప్రజలందరికీ ప్రయోజనం చేకూర్చే ఒక్క మంచి పని కూడా చేయలేదు. మోదీ దేశ ప్రజలకు ఏం చేయలేదని కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఇక.. ఈసారి బీజేపీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో నమ్మదగినది కాదు’ అని మల్లికార్జున ఖర్గే విమర్శలు చేశారు.

ప్రధాని మోదీ ఇవాళ ‘సంకల్ప పత్ర’ ఎ‍న్నికల మేనిఫెస్టో విడుదల చేసిన విషయం తెలిసిందే. ‘‘మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీగా పూర్తయ్యే గ్యారెంటీ. 70 ఏళ్లు పైబడిన వారికి ఉచిత వైద్యం అందిస్తాం. పేదల జీవితాలు మార్చడమే మోదీ ఇచ్చే గ్యారెంటీ. ఇచ్చిన ప్రతీ హామీని బీజేపీ నెరవేరుస్తుంది. ముద్ర రుణాల పరిమితి రూ.20 లక్షలకు పెంపు. ముద్ర పథకం ద్వారా కోట్ల మందికి ఉపాధి దక్కింది. మహిళలను లక్షాధికారులుగా చేయడమే మా లక్ష్యం. వ్యవసాయంలో టెక్నాలజీని పోత్సహిస్తున్నాం’’ అని ప్రధాని మోదీ వివరించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)