Breaking News

కొలువుదీరిన ప్రభుత్వం.. మంత్రి పదవులపై కొనసాగుతున్న సస్పెన్స్

Published on Fri, 12/06/2024 - 09:10

సాక్షి ముంబై:  మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్‌ నేతృత్వంలోని మహాయుతి కూటమి నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ఫలితాలు వెలువడిన 12 రోజుల తర్వాత ఎట్టకేలకు ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌.. ఉపముఖ్యమంత్రులుగా ఏక్‌నాథ్‌ షిండే, అజిత్‌ పవార్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. ఆజాద్‌ మైదానంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవాల వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖమంత్రి అమిత్‌ షా సహా.. బీజేపీ కూటమి అధికారంలో ఉన్న 22 రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, ప్రముఖ నేతలు, బాలీవుడ్‌ నటీనటుటు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో ఎవరెవరిని మంత్రి పదవులు వరించనున్నాయనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది.  సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్‌ షిండే, అజిత్ పవార్ ఇలా ముగ్గురే ప్రమాణ స్వీకారం చేయడంతో మంత్రి పదవులపై సస్సెన్స్ కొనసాగుతోంది. అయితే అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన బీజేపీకి సుమారు 20 నుంచి 25 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉండగా.. శివసేన (షిండేే) పార్టీకి సుమారు 10 నుంచి 12 అదేవిదంగా ఎన్సీపీ (ఏపీ)కి 8 నుంచి 10 మంత్రి పదవులు లభిస్తాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవుల ఆశిస్తున్న వారందరు లాబీ యింగ్ ప్రారంభించారు.

ఇదిలా ఉండగా తాను ముఖ్య మంత్రిని కానందుకు మనస్తాపానికి గుర య్యానన్న మాటలను మహారాష్ట్ర ఉప ముఖ్య మంత్రి షిండే కొట్టిపారేశారు. 2022లో శివసేనను నుంచి బయటకు వచ్చినపుడు తనవెంట ఉన్నది 39 మంది ఎమ్మెల్యేలని, నేడు, పార్టీకి 57 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, అసలు శివసేన ఎవరిదో దీన్ని బట్టే తెలి సిపోతోందని ఎద్దేవా చేశారు. ప్రమాణ స్వీకా రోత్సవం అనంతరం శివసేన ప్రధాన కార్యా లయం ఆనంద్ ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆయనకు ఘన స్వాగతం లభించింది. వందలాది మంది పార్టీ కార్యకర్తలు ప్లకార్డులు చేతబూని నినాదాలు చేస్తూ ఆయన్ను స్వాగతించారు.

<

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)