Breaking News

అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే టార్గెట్‌.. సీట్ల పంపకాలపై చర్చలు షురూ

Published on Fri, 08/02/2024 - 08:33

ముంబై: మరికొన్ని నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికార బీజేపీ కూటమికి ఆశించిన స్థానాలు రాకపోవడంతో అసెంబ్లీ ఎన్నికలపై గురిపెట్టింది. మరోవైపు ఈ సారి ఎలాగైనా అధికారాన్ని చేపట్టాలనే ధీమాతో ప్రతిపక్ష మహా వికాస్‌ అఘాడీ కూటమి పావులు కదుపుతోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై ప్రతిపక్ష కాంగ్రెస్‌, శివసేన(ఉద్దవ్‌), ఎన్సీపీ(శరద్‌పవార్‌) పార్టీలు ఆగస్టు 7న సమావేశం కానున్నాయి. ముంబైలో జరిగే ఈ కీలక భేటీలో మూడు పార్టీల మధ్య సీట్ల పంపకాలపై చర్చ జరగనుంది. వీటితోపాటు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ర్యాఆలీ ప్రణాళికతో సహా ఇతర అంశాలను సమావేశంలో చర్చిస్తామని కాంగ్రెస్‌ ఎల్పీ నేత బాలాసాహెబ్‌ థోరట్‌ పేర్కొన్నారు. గెలిచే అభ్యర్ధులను బరిలోకి దింపడం వల్ల సీట్ల మార్పిడి కూడా ఉండే అవకాశం ఉందని చెప్పారు.

ఇక 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో కూటమిలో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌..110 స్థానాల్లో పోటీచేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 10 స్థానాల్లో మాత్రమే పోటీ చేసిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌ చంద్ర పవార్) మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఎన్సీపీ దాదాపు 80 స్థానాల్లో పోటీపై కన్నేసినట్లు వినికిడి.. ఇక  ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన 100 కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి.

కాగా ఈ ఏడాది అక్టోబర్‌లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 48 లోక్‌సభ స్థానాలకు గాను 30 స్థానాలను ప్రతిపక్ష ఎంవీఏ గెలుచుకుంది. కాంగ్రెస్ రెబల్‌గా ఉన్న ఏకైక స్వతంత్ర ఎంపీ విశాల్ పాటిల్ ఆ పార్టీ అసోసియేట్ మెంబర్‌గా మారడంతో రాష్ట్రంలో ప్రతిపక్ష ఎంపీల సంఖ్య 31కి చేరుకుంది. బీజేపీ, ఎన్సీపీ, శివసేన కూటమి 17 స్థానాలకే పరిమితమైంది.

 

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)