Breaking News

పదే పదే జగన్‌ పర్యటనకు అడ్డంకులు.. ఇప్పుడు తాజాగా

Published on Wed, 07/30/2025 - 09:41

రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) ఎక్కడ పర్యటిస్తున్నా.. కూటమి సర్కార్ (Kutami Government) అనేక అడ్డంకులు సృష్టిస్తూనే ఉంది. ఇటీవల చిత్తూరు బంగారుపాళ్యంలో జగన్‌ పర్యటనను అడ్డుకునేందుకు ఎన్ని విధాల ప్రయత్నించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా..  

నెల్లూరులోనూ జగన్‌ పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జిల్లాలో పర్యటనలో భాగంగా అక్రమ కేసుల్లో అరెస్టై జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌తో గురువారం(జులై 31) వైఎస్‌ జగన్‌ ములాఖత్‌ కానున్నారు. ఇందుకు వైఎస్సార్‌సీపీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే.. అదే సమయంలో ఈ పర్యటనపై పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి.

నెల్లూరు వ్యాప్తంగా జగన్‌ పర్యటన సందర్భంగా పోలీస్‌ యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేస్తోంది కూటమి సర్కార్‌. ఈ నెల మొదట్లోనే ఈ పర్యటన జరగాల్సి ఉండగా.. హెలిప్యాడ్‌ అనుమతులను నిరాకరించింది. ఇప్పుడేమో..  కేవలం పది మందికి మాత్రమే అనుమతి అంటూ పోలీసులతో నోటీసులు ఇప్పించింది చంద్రబాబు సర్కారు.

కోవూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు పోలీసు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఎక్కడ చూసినా చెక్‌పోస్టులు కనిపిస్తున్నాయి. జగన్‌ పర్యటనకు జనసమీకరణ చేసినా.. స్వచ్ఛందంగా జనం గుంపుగా వచ్చినా చర్యలు తప్పవంటూ అనౌన్స్‌ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిసతే కఠిన చర్యలు, కేసులు తప్పవంటూ బెదిరిస్తున్నారు.

జగన్‌ వస్తున్నారంటే జనం తండోపతండాలుగా వచ్చే అవకాశం ఉండటంతో కూటమి సర్కారు భయభ్రాంతులకు గురౌవుతుంది., అందుకే ఆంక్షలతో వైఎస్‌ జగన్‌ జనాభిమానాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని వైఎస్సార్‌సీపీ మండిపడుతోంది. పోలీసుల తీరుపై ఇటు వైఎస్సార్‌సీపీ నేతలు.. కర్ఫ్యూను తలపించే ఆంక్షలతో అటు ప్రజలూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)