సిస్టర్‌ స్ట్రోక్‌తోనే కేటీఆర్‌ అలా మాట్లాడారు: మంత్రి సీతక్క

Published on Sat, 05/24/2025 - 14:56

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశించి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు తాజాగా చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క(Minister Seethakka) స్పందించారు. గోబెల్స్‌ ప్రచారంలో కేటీఆర్‌(KTR)ను మించిన వారే లేరని కౌంటర్‌ ఇచ్చారామె.

శనివారం మం‍త్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ..  ‘‘కవిత చెప్పిన దెయ్యం కేటీఆరే. సిస్టర్‌ స్ట్రోక్‌(Sister Stroke)తో కేటీఆర్‌ చిన్న మెదడు చిట్లింది. కాళేశ్వరంలో కమీషన్లు తిన్నప్పుడు లేని భయం.. కమిషన్‌ ముందు హాజరయ్యేటప్పుడు ఎందుకు?. అబద్ధాల పునాదులపై బీఆర్‌ఎస్‌ నడుస్తోంది. రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్‌కు లేదు’’ అని అన్నారామె. 

అటవీ అధికారులు ప్రజలకు సహకరించాలి
అటవీ శాఖ కఠిన నిబంధనల వల్ల ఉమ్మడి అదిలాబాద్, వరంగల్  జిల్లాల్లో అటవీ సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి సీతక్క అన్నారు. ‘‘ప్రజల తరఫున వారి సమస్యలను ఎమ్మెల్యేలు మా దృష్టికి తీసుకొస్తున్నారు. అందుకే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాలు చూపించాలనే ఉద్దేశంతో అటవీ శాఖ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, రోడ్లు భవనాల శాఖ, ఐటీడీఏ శాఖలతో ఈరోజు సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈ భేటీలో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను విస్తృతంగా చర్చించి ఓ మార్గం చూపిస్తాం. అటవీ ప్రాంతాల్లోనీ ప్రజల అభివృద్ధికి అటవీశాఖ అధికారులు మానవీయ కోణంలో సహకరించాలి. కనీస సౌకర్యాలు కల్పించాలి’’ అని అన్నారామె.

ఇదీ చదవండి: కవితకు ఇండైరెక్ట్‌ వార్నింగ్‌ ఇచ్చిన కేటీఆర్‌!

తెలంగాణలో అసలైన పొలిటికల్ దెయ్యం ఎవరు..?

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)