Breaking News

సీఎం కనుసన్నల్లోనే దాడులు!

Published on Sat, 09/14/2024 - 06:09

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం పేరిట కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు విమర్శించారు. ప్రజాపాలనలో ప్రతిపక్షాలు సమావేశం పెట్టుకునేందుకు కూడా అనుమతులు లేవా అనిప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేయడం దారుణమని మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం కేటీఆర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ సమావేశం పెట్టుకుంటే ముఖ్యమంత్రి వెన్నులో వణుకు వస్తోందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి నివాసంపై దాడి చేసిన అరికెపూడి గాంధీ అనుచరులు, గూండాలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

కౌశిక్‌రెడ్డిపై దాడి చేసిన వారిని వదిలేసి బీఆర్‌ఎస్‌ నేతలను అరెస్టు చేయడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు.  బీఆర్‌ఎస్‌ నేతలపై ప్రభుత్వ జులుంను సహించేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్‌ అప్రజాస్వామిక విధానాలను ప్రజలు గమనిస్తున్నారని.. ప్రశి్నస్తున్న ప్రజాప్రతినిధులపై సీఎం కనుసన్నల్లోనే గూండాలు దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో గతంలో ఎప్పుడూ లేని రీతిలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులకు దిగే సంస్కృతిని రేవంత్‌ తీసుకొచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పారీ్టకి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని వ్యాఖ్యానించారు.

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)