Breaking News

మాకు కొట్లాట కొత్తేం కాదు: కేటీఆర్‌

Published on Thu, 02/15/2024 - 10:33

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు హాట్‌ హాట్‌గా సాగుతున్నాయి. పరస్పర ఆరోపణల మొదలు.. అధికార, ప్రతిపక్ష ప్రధాన నేతలు వాడే భాష దాకా.. విమర్శల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో బుధవారం నాటి పరిణామాలు మరింత నాటకీయంగా సాగాయి. 

పదేళ్లపాటు అధికారపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్‌.. తొలిసారి ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్‌ చేసింది. ఇది ఇక్కడితోనే అయిపోలేదు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడేందుకు యత్నించగా.. సభ జరుగుతుండగా నిబంధనలు అందుకు అనుమతించవంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో.. అక్కడే రోడ్డు మీదే బైఠాయించి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. ఈ సందర్భాన్ని ప్రస్తావిస్తూ తాజాగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎక్స్‌ ఖాతాలో ఓ ట్వీట్‌ చేశారు.  

మాకు కొట్లాట కొత్తేమీ కాదు! గతంలో ఇదే రోడ్ల మీద ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉద్యమం చేసి.. రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర మా BRS పార్టీకి ఉంది. జై తెలంగాణ అంటూ పోస్ట్‌ చేశారాయన. అసెంబ్లీలో నిన్నటి నిరసన.. తెలంగాణఉద్యమ కాలం నాటి రోజుల్ని గుర్తు చేసిందంటూ సందేశం ఉంచారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)