కేటీఆర్‌ Vs కాంగ్రెస్‌.. అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ కౌంటర్‌

Published on Fri, 08/04/2023 - 15:10

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సభలో వాడీవేడిగా చర్చ నడుస్తోంది. అసెంబ్లీ సెషన్స్‌లో భాగంగా మంత్రి కేటీఆర్‌.. కాంగ్రెస్‌ నేతలపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీల నేతలకు కౌంటరిచ్చారు. 

సభలో శుక్రవారం కేటీఆర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నేతలు గాలి మాటలు మాట్లాడుతున్నారు. రుణమాఫీ చేయడంతో కాంగ్రెస్‌ నేతల ఫీజులు ఎగిరిపోయాయి. కాంగ్రెస్‌ హయాంలో ఏనాడైనా కనీసం ఆరు గంటలైనా కరెంట్‌ ఇచ్చారా?. ఎవరు రైతులను రాబందుల్లా పీక్కుతున్నారో ప్రజలకు తెలుసు అంటూ కామెంట్స్‌ చేశారు. ఇదే సమయంలో సంచలన కామెంట్స్‌ చేశారు. 

తెలంగాణలో కులగజ్జి, మత పిచ్చి లేదన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో స్టేబుల్‌ గవర్నమెంట్‌ ఉందన్నారు. బెంగుళూరును వెనక్కి నెట్టి ఐటీ ఉద్యోగాల కల్పనలో తెలంగాణ నెంబర్‌ వన్‌ అయిందని పేర్కొన్నారు. ఐటీ అభివృద్ధిని ప్రతిపక్షాలు మెచ్చుకోవాలని చెప్పారు. 1987లో  ఇంటర్‌  గ్రాఫ్‌ అనే సంస్థ హైదరాబాద్‌కు వచ్చిందని, ఈ విషయం మేమే ఐటీ తెచ్చామనే వారు తెలుసుకోవాలని మంత్రి కేటీఆర్‌ హితవు పలికారు. 

రజనీకాంత్‌ లాంటి వ్యక్తి కూడా హైదరాబాద్‌ గురించి చెప్పారని కానీ కొంతమంది ఇంకా కళ్లు తెరవడం లేదని విమర్శించారు.  ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరిస్తున్నామని తెలిపారు. జిల్లాలకు విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. హుజురాబాద్‌లో ఐటీ కంపెనీ వచ్చిందని ఈటలకు కూడా తెలుసుకోవాలన్నారు. మరోవైపు.. హైదరాబాద్‌లోని కోకాపేట భూముల వేలంపై అసెంబ్లీలో కేటీఆర్‌ మాట్లాడారు. కోకాపేట భూముల ధర రికార్డు బద్దల కొట్టిందని చెప్పారు. ఎకరం వంద కోట్లు పలికిందంటే హైదరాబాద్‌ అభివృద్ధి అర్థం చేసుకోవచ్చని తెలిపారు. డైలాగులు, ధర్నాలతో ఇంత ధర రాదని చురకలంటించారు. 

ఇది కూడా చదవండి: కోకాపేటలో ఎకరం రూ.100 కోట్లు.. కేసీఆర్‌ ఏమన్నారంటే..

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)