Breaking News

వచ్చే ఏడాదిలో పాదయాత్ర చేస్తా : కేటీఆర్‌

Published on Thu, 03/20/2025 - 17:08

సాక్షి,సూర్యాపేట: సూర్యాపేట జిల్లా వేదికగా మాజీ మంత్రి కేటీఆర్‌ కీలక ప్రకటన చేశారు. బీఆర్‌ఎస్‌ అధికారమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ప్రణాళికను సిద్ధం చేసినట్లు చెప్పారు. 

సూర్యాపేటలో గురువారం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం అనంతరం కేటీఆర్‌ మీడియాతో చిట్‌ చాట్‌ నిర్వహించారు. ‘వచ్చే ఏడాది పాదయాత్ర బీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తీసుకురావడేమే లక్ష్యం. సూర్యాపేటలో జనాల్ని చూస్తుంటే పెద్ద బహిరంగ సభకే వచ్చినట్లుంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ దే అధికారం’ అని ధీమా వ్యక్తం చేశారు.

మరోసారి కేసీఆరే సీఎం
అంతకుముందు బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. మరోసారి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర బడ్జెట్‌పై ఆయన మాట్లాడారు. బడ్జెట్‌లో పథకాల అమలుకు సంబంధించి నిధుల కేటాయింపు లేదు.రుణమాఫీ చేశారో లేదో సీఎం రేవంత్‌రెడ్డి సొంత ఊరికి వెళ్లి అడుగుదాం. తెలంగాణ ధనం అంతా రాహుల్, సోనియా, ప్రియాంకా గాంధీ ఖాతాలో పడుతున్నాయి.ధాన్యం దిగుమతిలో తెలంగాణలో నల్లగొండను నంబర్ వన్ చేశారు కేసీఆర్.

ఎస్‌ఎల్‌బీసీలో విషాదం.. చేపల కూర తింటున్న మంత్రులు  
ఎస్‌ఎల్‌బీసీలో విషాదం జరిగితే మంత్రులు చేపల కూర తింటున్నారు. ఓ మంత్రి నీళ్లు, వాటర్ కలిశాయని అంటున్నారు. గాడిదలను చూస్తేనే గుర్రాల విలువ తెలుస్తుంది. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు శత్రువులే. కేసీఆర్‌పై ద్వేషంతో జిల్లాలో పంటలకు నీళ్లు ఇవ్వడం లేదు. కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువు ఇది. చెరువులు నింపితే బోర్లు ఎందుకు ఎండిపోతాయి. రేవంత్‌కు   వ్యతిరేకంగా కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఒక్క మాట మాట్లాడదు. ఏం మాట్లాడకముందే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారు. అసెంబ్లీని గాంధీభవన్ అన్న మజ్లిస్ సభ్యులపై చర్యలు తీసుకునే దమ్ము లేదా? అని ప్రశ్నించారు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)