Breaking News

ఇంతకీ ఆ ఎమ్మెల్యేది ఏ పార్టీ : కేటీఆర్‌

Published on Tue, 09/09/2025 - 16:17

సాక్షి,హైదరాబాద్‌: కొందరు ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేదని దుస్థితిలో ఉన్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. గద్వాల్‌ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌ మీటింగ్‌లకు ఎందుకు రావడం లేదు?.కాంగ్రెస్‌ కండువా వేసుకుని సిగ్గులేకుండా బీఆర్‌ఎస్‌లో ఉన్నానంటున్నాడు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే వేటువేయాలి’అని డిమాండ్‌ చేశారు. 

మరోవైపు తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం చర్చాంశనీయంగా మారింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల విషయంలో మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ క్రమంలో గత వారం తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. వీరి భేటీలో ఏం చర్చించారనే అంశం గురించి తెలియాల్సి ఉంది.

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే వేటు వేయాలి: కేటీఆర్

‘ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్’ అంటే ఒప్పుకోం 
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కేసు విచారణలో భాగంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.మూడు నెలల్లోగా ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ శాసనసభ స్పీకర్‌కు ఆదేశించింది. పదో షెడ్యూల్ ప్రకారం, స్పీకర్‌కు రాజ్యాంగ రక్షణ లేదని పేర్కొంది.  తెలంగాణ హైకోర్టు తీర్పును కొట్టివేసింది. తద్వారా స్పీకర్‌ నిర్ణయం ఆలస్యం చేయడం సరికాదని స్పష్టం చేసింది. ‘ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్’ అనే పరిస్థితిని అంగీకరించలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనర్హత పిటిషన్లను సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉంచడం సమంజసం కాదని పేర్కొంది.పార్టీ ఫిరాయింపులకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని సూచించింది.

ఫిరాయింపులు ఎమ్మెల్యేలు వీళ్లేనా? 
2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌లో గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్‌లు ఉన్నారు.వీరిలో గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఏ పార్టీలో ఉన్నారనేది ప్రశ్నార్ధకంగా మారింది. తాను ఇప్పటికీ గద్వాల్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేనని కృష్ణమోహన్‌రెడ్డి అంటుంటే.. కేటీఆర్‌ మాత్రం గద్వాల్‌ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌నని చెప్పుకుని.. పార్టీ కార్యక్రమాలకు ఎందుకు గైర్హాజరవుతున్నారని ప్రశ్నిస్తున్నారు.  
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)